Sai Pallavi:సాయి పల్లవి అమితంగా ఇష్టపడే ఏకైక టాలీవుడ్ అతనేనా?

Posted by venditeravaartha, July 24, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Sai Pallavi: టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్ లు ఉన్నప్పటికీ తన అభినయం తో కేవలం యువత లోనే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకుల ఆదరణ సంపాందించిన హీరోయిన్ సాయి పల్లవి మొదట ఢీ షో లో తన డాన్స్ తో అందరిని ఆశ్చర్య పరిచిన సాయి పల్లవి ,ఆ తర్వాత మలయాళం లో రిలీజ్ అయినా సూపర్ హిట్ ‘ప్రేమమ్’ సినిమా తో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సాయి పల్లవి , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ ‘ఫిదా’ సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు.ఇక వరుసగా నాని .శర్వానంద్,నాగ చైతన్య ,ధనుష్ వంటి స్టార్ హీరోస్ తో నటించి అగ్ర హీరోయిన్ ల జాబితా లో చేరారు.

తన మొదటి సినిమా నుంచి సాయి పల్లవి గారు తనదైన శైలి లో నటన తో పాటు గా డాన్స్ ని కూడా అద్భుతం గా చేస్తూ వచ్చారు, అయితే తన సాటి హీరోయిన్ ల కి బిన్నంగా గ్లామర్ పాత్రా ల కి దూరంగా ఉంటూ కూడా అద్భుతమైన సినిమా ల లో ఛాన్స్ లు సాధించారు, ఇక సాయి పల్లవి సినిమా లో ఉన్నారు అంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే రేంజ్ కి తన స్టోరీ సెలక్షన్ ఉంటుంది.అయితే గత కొన్ని సినిమా ల నుంచి ఆశించిన విజయాలు లేకపోయినా తన నటన తో అందరిని అలరిస్తున్నారు సాయి పల్లవి.నాగ చైతన్య కి కం బ్యాక్ సినిమా గా చెప్పుకున్న లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ లో సాయి పల్లవి గారికి కూడా క్రెడిట్ ఇచ్చారు అంటే ఆమె ఆ స్థాయి లో నటించారు.

సాయి పల్లవి గారు తెలుగు లో చివరగా నటించిన సినిమా విరాటపర్వం , ఆ సినిమా ఆశించిన స్థాయి లో అలరించలేదు, అయితే అటు తమిళ్ ,హిందీ బాషా ల లో కూడా బిజీ ఉన్న సాయి పల్లవి గారు త్వరలో రిలీజ్ కానున్న నాగ చైతన్య తండేల్ లో కనిపించనున్నారు.యంగ్ సెన్సేషన్ చందూ మొండేటి డైరెక్టర్ గా రానున్న ఈ సినిమా లో సత్య పాత్రా లో మన ముందుకు రానున్నారు సాయి పల్లవి. ఇక ఇటీవల తన సినిమా ప్రమోషనల్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన ఫేవరెట్ హీరో ఎవరు అనేది వెల్లడించారు సాయి పల్లవి.

తన సినీ కెరీర్ ప్రారంభం లోనే నాని ,వరుణ్ తేజ్ ,సూర్య ,నాగ చైతన్య ,ధనుష్ వంటి స్టార్ హీరో ల తో నటించిన సాయి పల్లవి గారు తన ఫేవరెట్ హీరో మాత్రం ‘మెగా స్టార్ చిరంజీవి ‘ అని చెప్పారు.తన చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి డాన్స్ ,కామెడీ టైమింగ్ తో పాటు గా ఆయన నటన అంటే చాల ఇష్టం అని చెప్పారు.వరుణ్ తేజ్ తో ఫిదా టైం లో మెగాస్టార్ ని కలిసాను అని అప్పుడే తన అభిమాన హీరో ని కలవడం చాల హ్యాపీ గా అనిపించింది అని తెలియచేసారు.ఇక భోళా శంకర్ లో చిరు కి సిస్టర్ గా నటించే అవకాశం వచ్చినప్పటికీ తన అభిమాన హీరో తో నటించలేను అని అది కూడా సిస్టర్ పాత్ర చేయను అని రిజెక్ట్ చేశారు సాయి పల్లవి.తన సినిమా సెలక్షన్ ఈ రేంజ్ లో ఉంటుందో మనమే అర్ధం చేసుకోవచ్చు.

226 views