UGRAM:ఉగ్రం మూవీ రివ్యూ

Posted by venditeravaartha, May 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అల్లరి నరేష్ హీరో గా విజయ్ కనకమేడల డైరెక్టర్ గా షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి,హరీష్ పెద్ది కలిసి నిర్మించిన చిత్రం ‘ఉగ్రం’, మొదట నుంచి కామెడీ సినిమా ల కి కేరాఫ్ అడ్రెస్స్ గా ఉన్న అల్లరి నరేష్ నాంది చిత్రం నుంచి స్టైల్ మార్చాడు,అప్పట్లో అప్పుడపుడు గమ్యం,శంభో శివ శంభో, నేను,విశాఖ ఎక్స్ప్రెస్ లాంటి చిత్ర ల లో నటించిన కామెడీ కె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల తో కలిసి చేస్తున్న రెండవ చిత్రం కావడం ,ఇది వరకే రిలీజ్ అయినా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడం తో ఈ చిత్రం మీద మంచి ఎక్సపెక్టషన్ ఏ ఉన్నాయి,మరి ఏ రోజు థియేటర్ ల లో ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయినా ఉగ్రం ‘అల్లరి నరేష్’ కి హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం !

కథ: శివ కుమార్(అల్లరి నరేష్) ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తన భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతుంటాడు.డ్యూటీ లో నిజాయితీ గా ఉండే శివ కుమార్ కి ఒక అంతు చిక్కని ఓ కేసు ఎదురవుతోంది,ఊర్లో ఉన్న ఆడవాళ్ళూ ,పిల్ల లు ని ఎవరో తెలియని వ్యక్తులు మిస్ చేస్తుంటారు,ఈ కేసు ని డీల్ చేస్తున్న సమయం లోనే తన భార్య ,పిల్ల లు కూడా మిస్ అవుతారు ,తన భార్య పిల్లలతోపాటు చాలామంది మిస్సింగ్ అవ్వడం వెనుక ఉన్న మిస్టరీని ఎలా ఛేదించి కనుక్కున్నారు,వరుసగా మిస్సింగ్ కాబడిన వారు ఎవరు ,ఇదంతా చేసింది ఎవరు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:నాంది సినిమా తో ప్లాప్ ల లో ఉన్న అల్లరి నరేష్ కి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ ,ఈ సినిమా తో అల్లరి నరేష్ కి హాట్ తో పాటు అవార్డు వచ్చేలా చేసారు అనడం లో సందేహమే లేదు,అల్లరి నరేష్ లో ఉన్న నటుడి ని పూర్తి స్థాయి లో వినియోగించుకున్నారు డైరెక్టర్.ఈ సినిమా లో అల్లరి నరేష్ కి జంట నటించిన మలయాళ బ్యూటీ మీరేనా మీనన్ మంచి నటన తో ఆకట్టుకుంది,శ్రీ చరణ్ అందించిన సంగీతం ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా కి హైలైట్ గా నిలిచాయి.
పాజిటివ్:కథ,స్క్రీన్ ప్లే , సస్పెన్స్,అల్లరి నరేష్,క్లైమాక్స్.
నెగటివ్:కొంచెం స్లో అయినా 1st హాఫ్ .
రేటింగ్:4 / 5
చివరిగా అల్లరి నరేష్ యొక్క నట విశ్వరూపమే ‘ఉగ్రం’.

28993 views