TOLLYWOOD:మొదటి సినిమా తో హిట్ కొట్టి కూడా షెడ్డుకి వెళ్లిన టాలీవుడ్ హీరోయిన్లు వీళ్ళే!

Posted by venditeravaartha, April 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో లు 80 + వయసు లో కూడా హీరో గా చేసి రాణిస్తారు కానీ హీరోయిన్ విషయం కి వస్తే వాళ్ళు హీరోయిన్ గా పరిచయం అయినప్పటి నుంచి 5 ,6 సంవత్సరాలు మాత్రమే రాణిస్తారు. అలా కొంత మంది హీరోయిన్స్ తమ మొదటి సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి తర్వాత నుంచి ఆ స్థాయి హిట్ లేకపోవడం తో సినిమా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయి పోయిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

1 .అనురాధ మెహతా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,సుకుమార్ కలయిక లో 2004 లో రిలీజ్ అయినా ‘ఆర్య’ సినిమా తో తెలుగు సినిమా కి పరిచయం అయ్యారు ‘అనురాధ మెహతా’.మొదటి సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని పొందారు ,ఆ తర్వాత రిలీజ్ అయినా ‘నువ్వంటే నాకు ఇష్టం’,’ మహారాజశ్రీ’ సినిమా లు ప్లాప్ లు గా నిలిచాయి.2008 నుంచి సినిమా ల కి దూరం అయ్యారు.

2 .అదితి అగర్వాల్
అల్లు అర్జున్ గారి మొదటి సినిమా ‘గంగోత్రి’ సినిమా తో సూపర్ డూపర్ హిట్ తో తెలుగు తెర కి పరిచయం అయ్యారు ‘అదితి అగర్వాల్ ‘,ఈమె అప్పటి హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గారి చెల్లి. 2003 లో రిలీజ్ అయినా గంగోత్రి తో ఫేమస్ అయినా అదితి తర్వాత రిలీజ్ అయినా ‘కొడుకు’,’విద్యార్థి’ సినిమా లు అపజయాలు కావడం తో 2004 నుంచే సినిమా లను వదిలేసారు.

3 .రిచా గంగోపాధ్యాయ్
2010 రిలీజ్ అయినా రానా గారి మొదటి సినిమా ‘లీడర్ ‘ తో పరిచయం అయినా హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్.ఆ తర్వాత వరుస గా మిరపకాయ్,మిర్చి సినిమా ల తో సూపర్ హిట్లు అందుకున్నారు, 2013 తర్వాత పెళ్లి చేసుకుని సినిమా ల కు దూరమయ్యారు.

4 .ఇషా చావ్లా
సాయి కుమార్ కొడుకు అయినా ‘ఆది ‘ హీరో గా 2011 లో రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ హిట్’ప్రేమ కావాలి’. ఈ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయ్యారు ‘ఇషా చావ్లా’.తర్వాత ‘పూల రంగడు’ హిట్ అయినప్పటికీ ,తర్వాత రిలీజ్ అయినా బాలకృష్ణ గారి ‘శ్రీమన్నారాయణ’, సునీల్ గారి ‘మిస్టర్ పెళ్ళికొడుకు ‘,నరేష్ గారి ‘జంప్ జిలాని ‘ సరిగా ఆడలేదు .దాంతో 2014 నుంచి తెలుగు పరిశ్రమ నుంచి దూరమయ్యారు.

5 .రేణు దేశాయ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,పూరి జగన్నాధ్ గారి కలయిక లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘బద్రి’,2000 లో రిలీజ్ అయినా ఈ చిత్రం తో ‘రేణు దేశాయ్ ‘ గారు హీరోయిన్ గా పరిచయం అయ్యారు ,2003 లో రిలీజ్ అయినా ‘జానీ ‘ సినిమా తో సినిమా ల నుంచి తప్పుకున్నారు.

242 views