#RRR విలన్ రేయ్ స్టీవెన్ సన్ కన్నుమూత..షూటింగ్ స్పాట్ లో దుర్మరణం

Posted by venditeravaartha, May 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Ray Stevenson: తెలుగు సినీ ప్రేక్షకులు ఒకే రోజు రెండు విచారకరమైన వార్తలు వినాల్సి వచ్చింది. ఒకటి మన సీనియర్ నటుడు శరత్ బాబు చనిపోవడం,మరొకటి ( RRR ) చిత్రం లో విలన్ గా నటించిన స్కాట్ దొర ‘రేయ్ స్టీవెన్ సన్’ మరణించడం. శరత్ బాబు అంటే గత కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకుంటూ మధ్యలో మరణించాడు. కానీ ‘రేయ్ స్టీవెన్ సన్’ ఎంతో ఆరోగ్యం తో ఉండే వ్యక్తి. చురుగ్గా షూటింగ్స్ లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న వ్యక్తి. అలాంటి ఆరోగ్యం తో ఉన్న వ్యక్తి నేడు ఇటలీ లో ఒక సినిమా షూటింగ్ చేస్తూ మధ్యలో చనిపోవడమే ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. రేయ్ స్టీవెన్ సన్ RRR చిత్రం తో ఇండియా లో కూడా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడం తో ఆయనకీ ఇండియన్ ఫిలిమ్స్ లో నటించే ఛాన్స్ కూడా దక్కింది.

rrr-scott-dora-ray-stevenson-has-passed-away

ప్రస్తుతం ఆయన ‘అశోక’ అనే ఇండియన్ చిత్రం లో నటిస్తున్నాడు.ఈ సినిమాతో పాటుగా ఆయన పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా సమాంతరం గా నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఒకప్పుడు యాక్షన్ హీరో గా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన రేయ్ స్టీవెన్ సన్ , ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఆయన హీరో గా నటించిన ‘పనిషర్ : ది వార్ జోన్’ అనే చిత్రం హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఈ చిత్రాన్ని మన ఇండియన్ ఆడియన్స్ ఎవరు చూడలేదు కానీ, ఆయన ‘థోర్’ చిత్రం ద్వారా మన అందరికీ సుపరిచితమే. హాలీవుడ్ సినిమాలను చూసే ఇండియన్ ఆడియన్స్ కి ఈయన తెలియకుండా ఉండరు. వారిలో ఈయనకి ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు. అలాంటి లెజెండరీ యాక్టర్ ఈరోజు మన మధ్య లేకపోవడం మనం చేసుకున్న దురదృష్టం.

rrr-scott-dora-ray-stevenson-has-passed-away

రేయ్ స్టీవెన్ సన్ 1964 వ సంవత్సరం లో లిస్ బర్న్ , నార్త్ ఐర్లాండ్ లో జన్మించాడు. 1998 వ సంవత్సరం లో ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్’ అనే చిత్రం ద్వారా హీరో గా అడుగుపెట్టిన స్టీవెన్ సన్, ఆ తర్వాత ‘కింగ్ అర్థుర్’ చిత్రం ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత 2008 వ సంవత్సరం లో విడుదలైన ‘పనిషర్ : ది వార్ జోన్’ అనే చిత్రం రేయ్ స్టీవెన్ సన్ కెరీర్ ని మార్చేసింది. ఆ తర్వాత ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరో గా , క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘1242 : ది గేట్ వే టూ ది వెస్ట్’ మరియు ‘కాసినో ఇన్ విస్చియా’ చిత్రం తో పాటుగా ‘అశోక’ అనే ఇండియన్ ఫిలిం లో కూడా నటిస్తున్నాడు, ఇవన్నీ విడుదల కాకముందే ఆయన మన అందరినీ వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం.

Tags :
606 views