Raviteja: యంగ్ హీరో తో రవితేజ భారీ మల్టీ స్టారర్.

Posted by venditeravaartha, July 5, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి మొదట చిన్న చిన్న క్యారెక్టర్ లు చేసి ప్రస్తుతం స్టార్ హీరో గా ఎదిగిన రవితేజ గారు ఈ మధ్య కాలం లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ల తో సూపర్ సక్సెస్ లో ఉన్నారు.గత ఏడాది ధమాకా తో 100 కోట్ల క్లబ్ లో చేరిన రవితేజ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో వాల్తేర్ వీరయ్య తో ఆల్ టైం బ్లాక్ బస్టర్ తో 200 కోట్ల క్లబ్ లో చేరి ప్రస్తుతం వరుస సినిమా ల తో బిజీగా ఉన్నారు.ఇప్పుడు రవితేజ(Raviteja) గారి నుంచి ఒక బ్లాక్ బస్టర్ న్యూస్ బయటకి వచ్చింది.

chiranjeevi

సుదీర్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన రావణాసుర కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ రవితేజ గారి కి మంచి పేరు నే తెచ్చి పెట్టింది.ఇక రానున్న తన టైగర్ నాగేశ్వర రావు ,ఈగల్ తో పాటు గా కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మరో మాస్ సినిమా ని చేయనున్నారు. నూతన దర్శకుడు తో ఒక భారీ కమర్షియల్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది ఈ సినిమా లో రవితేజ కి తోడు గా మరో యువ హీరో చేయనున్నారు అతను మరి ఎవరో కాదు దాస్ కా ధమ్కీ అయినా విశ్వక్ సేన్(Viswak sen).వీరి కలయిక లో రాబోతున్న సినిమా ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియన్ లెవెల్ లో తీయబోతున్నారు.

viswak sen

ఈ నగరానికి ఏమైంది మూవీ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్.
అశోక వనంలో అర్జున కళ్యాణం ,ఫలక్ నామ దాస్ వంటి సినిమా ల తో స్టార్ డాం తెచ్చుకున్న విశ్వక్ సేన్ రవితేజ గారితో కలిసి మంచి కమర్షియల్ సినిమా చేయనున్నారు,ఇందులో వీరి కి విలన్ గా మంచు మనోజ్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇదే కానీ నిజం అయితే రవితేజ ,విశ్వక్ సేన్ ,మనోజ్(Manoj) కలయిక లో కమర్షియల్ సినిమా ని చూడబోతున్నారు..ఈ సినిమా ని ఈ సంవత్సరం ఆఖరు కి తెర మీదకి తీసుకుని రాబోతున్నారు.

raviteja and viswak sen

1928 views