Tollywood Celebrities:సినిమా సెలెబ్రెటీలకు పెళ్లిళ్లు పనికిరావా..? ఇలా ఒకరి తర్వాత ఒకరు విడిపోవడానికి కారణం ఏమిటి?

Posted by venditeravaartha, March 21, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మన భారత దేశ సంప్రదాయం లో పెళ్లి అనేది చాల పవర్ ఫుల్ బంధం, హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.
కానీ ఇప్పడు పెళ్లి అనేది మూడు నాళ్ల ముచ్చట గానే చూస్తున్నారు,ముఖ్యముగా ప్రముఖులు గా చెప్పుకునే వారు ,సమాజం లో పేరు ,పలుకుపడి, డబ్బు ఉన్న వారు కూడా వివాహ బంధం దగ్గర కలిసి ఉండలేకపోతున్నారు, ఇటీవల కాలం లో వ్యాపార ,సినిమా రంగాలకి చెందిన కొంత మంది ప్రముఖులు తమ పార్టనర్స్ తో కలిసి ఉండలేక డివోర్స్ తీసుకుని వేరే వాళ్ళని వివాహం చేసుకోవడం ,లేదా అలానే ఒంటరి గా ఉండటం ఎక్కువ అయిపోతున్నాయి.
అప్పట్లో కూడా కొంత మంది ప్రముఖులు ఇలానే ఉండే వారు కానీ వారు కనీసం 10 ,15 సంవత్సరాలు అయినా కలిసి ఉండి తర్వాత బేధాభిప్రాయాలు వచ్చి విడిపోయే వారు కానీ ఇప్పుడు పెళ్లి అయినా 1 ,2 సంవత్సరాల లో విడిపోతున్నారు.

ముఖ్యముగా సినిమా పరిశ్రమ లో ఉండే హీరో ,హీరోయిన్ లు ప్రేమించి మరి పెళ్లి చేసుకుని , అంతే త్వరగా విడిపోతున్నారు,సమస్య ఎక్కడ ఉందా అని కూడా ఆలోచించుకునే సమయం కూడా తీసుకోవడం లేదు , ఈ మధ్య సమంత , నాగ చైతన్య ల వివాహమే ఉదాహరణ గా తీసుకుంటే ‘ఏ మాయ చేసావే ‘ సినిమా తో తెలుగు సినిమా లోకి అడుగు పెట్టిన సమంత , ఆ సినిమా లో నాగ చైతన్య తో ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమ గారి చైతన్య ని పెళ్లి చేసుకుని , అక్కినేని ఫ్యామిలీ లో కి అడుగు పెట్టారు ,2017 లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట సరిగ్గా 4 సంవత్సరాల లో 2021 కి విడాకులు తీసుకున్నారు,ఇరువురు ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ ఈ జంట విడిపోవడానికి గల ముఖ్య మైన కారణం సమంత గారు హిందీ లో తీసిన కొన్ని బోల్డ్ వెబ్ సిరీస్ లే అని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇక టాలీవుడ్ లో వీపరీతమైన క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ గార్లు 2012 విడాకులు తీసుకున్నారు,2000 సంవత్సరం లో రిలీజ్ అయినా ‘బద్రి ‘ సినిమా టైం లో ఏర్పడిన స్నేహం తో సహజీవం చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ ,రేణు దేశాయ్, 2009 లో వీరు వివాహం చేసుకున్నారు. సరిగ్గా 3 ఇయర్స్ కి విడాకులు తీసుకున్నారు.

విలక్షణ నటుడు గా పేరు తెచ్చుకున్న ‘ప్రకాష్ రాజ్ ‘ గారు 1994 లో లలిత కుమారి గారిని వివాహం చేసుకున్నారు , లలిత కుమారి దక్షిణ భారత చలనచిత్ర నటి. ఆమె తమిళ నటుడు సి.ఎల్. ఆనందన్ కుమార్తె, నటి డిస్కో శాంతి చెల్లెలు. 2009 లో ప్రకాష్ రాజ్ గారు ఈమెతో విడాకులు తీసుకుని బాలీవుడ్ డాన్సర్ అయినా ‘పోనీ వర్మ ‘ ని 2010 లో పెళ్లి చేసుకున్నారు.

భారత దేశ ‘మైఖేల్ జాక్సన్ ‘ గా పిలుబడే ‘ప్రభు దేవా ‘ గారు 1995 లో ‘రామలత్ ‘ గారిని వివాహం చేసుకున్నారు ,ఈమె ముస్లిం అయినప్పటికీ ప్రభుదేవా తో పెళ్లి తర్వాత తన పేరు ని లతా గా మార్చుకున్నారు,కానీ ప్రభు దేవా , నయనతార ప్రేమ వ్యవహారం లో గొడవలు పడి 2011 లో విడాకులు తీసుకున్నారు.

ఇక బాలీవుడ్ లో స్టార్ హీరో లు అయినా అమిర్ ఖాన్ ,హ్రితిక్ రోషన్ ,సైఫ్ అలీఖాన్ మొదలగు వారు తమ భాగస్వామి ల తో విడాకులు తీసుకున్న వారే.అసలు సమస్య ఏంటి, ఎందుకు విడిపోయావాలి అనుకునే వారే లేకుండా పోయారు , డబ్బులు ఉంది ,సమాజం లో పేరు ఉంది కాబట్టి మేము విడిపోతాము ,విడిపోయి వేరు వేరు గా ఉంటాము అనే ధోరణి లో ఉన్నారు అంతా,ఇదే విధముగా జరుగుతూ ఉంటె మన భారత దేశం కూడా బయట దేశాల మాధిరిగా సహజీవనం చేసే ఆచారాన్ని తీసుకుని వచ్చే ప్రమాదం ఉంది. సెలబ్రిటీ లు అయితే ఏమి ,సామాన్యుడు అయితే ఏమి పెళ్లి అనే దానికి అర్ధం మార్చే పని లో ఉంది ఈనాటి సమాజం.

419 views