NTR:క్రూర మృగాలతో పోరాడబోతున జూనియర్ ఎన్టీఆర్ : ‘డైరెక్టర్ కొరటాల శివ’

Posted by venditeravaartha, March 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో అతి చిన్న వయసు లోనే స్టార్ ఇమేజ్ ని తెచ్చుకుని ,పెద్ద పెద్ద హీరో ల కి పోటీ గా నిలిచి ఇప్పుడు ప్రపంచ స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్న ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ గారు తన 30 వ సినిమా షూటింగ్ ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసారు.2015 నుంచి వరుసగా తాను నటించిన 6 సినిమా లు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి, RRR సినిమా ఇచ్చిన సక్సెస్ తో మోస్ట్ టాలెంటెడ్ సక్సెస్ కలిగిన ‘కొరటాల శివ ‘ గారి డైరెక్షన్ లో ఎన్టీఆర్ 30 మూవీ రెగ్యులర్ షూటింగ్ కి ముహూర్తం స్టార్ట్ చేసారు.

RRR సినిమా షూటింగ్ జరుగుతోన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని , డైరెక్టర్ కొరటాల శివతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. యంగ్ సెన్సషనల్ అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ముందుగా ప్రకటించినట్లుగానే తాజాగా హైదరాబాద్‌లో జరిపారు. సరిగ్గా ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ముందుగా నిర్మాతలు నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్‌తో పూజారి దేవుడి చిత్ర పటాలకు పలు పూజలు చేశారు.


ఈ సినిమా పూజా కార్యక్రమాల కోసం చిత్ర యూనిట్ సభ్యులు జాన్వీ కపూర్, అనిరుథ్ రవిచందర్, సాబు సిరిల్, రత్నవేలుతో పాటు టాలీవుడ్‌లోని సినీ ప్రముఖులు చాలా మంది విచ్చేశారు. అందులో రాజమౌళి, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, ప్రశాంత్ నీల్‌, దిల్ రాజు, బాపినీడు, కేఎస్ రామారావు, శ్యాం ప్రసాద్ రెడ్డి, నాగ వంశీ తదితరులు ఉన్నారు.

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అంతేకాదు, ఈ చిత్రం ఇండియాలో ఎవరూ చూడని కోస్టల్ ఏరియా కు సంబంధించిన బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని చెప్పారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన మెయిన్ పాయింట్‌ను రివీల్ చేసేశారు. ‘ఈ కథలో మనుషుల కంటే మృగాలే ఎక్కువగా కనిపిస్తాయి. వాటికి దేవుడు అంటే భయం ఉండదు.. చావంటే భయం ఉండదు. కానీ, ఒకే ఒకటి అంటే భయం. ఆ భయం ఏంటో మీకు కూడా తెలుసు’ అంటూ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ తీరును వెల్లడించారు.గతంలో ఇండియాలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో కొన్ని చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో రాబోతున్న ఈ చిత్రం మాత్రం వాటికి మించేలా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. అంతేకాదు, ఇది తన కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని కొరటాల స్పష్టం చేశారు.

ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంటుందని ఆయన తెలిపారు.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ముగిసిన వెంటనే స్క్రిప్టును శ్యాం ప్రసాద్ రెడ్డి చిత్ర యూనిట్‌కు అందించారు. ఆ తర్వాత హీరో హీరోయిన్లపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టారు. ప్రశాంత్ నీల్ కెమెరా స్విచ్ ఆన్ చేసి మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. దీంతో ఈ వేడుక ఎంతో గ్రాండ్‌గా ముగిసింది.

368 views