Anushka Shetty: అనుష్కకు లిప్ లాక్ ఇచ్చిన మొదటి హీరో ప్రభాస్.. మరి రెండో హీరో ఎవరో తెలుసా?

Posted by venditeravaartha, June 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Anushka Shetty: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. తెలుగు, తమిళం ఇండస్ట్రీల్లోని దాదాపు అగ్రహీరోలతో నటించిన ఈమె సక్సెస్ నటిగా పేర్కొంటారు. అనుష్క నటించిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. మరికొన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. హీరోయిన్ ఒరియేంటెడ్గా అనుష్క నటించిన ‘అరుంధతి’ ఆమె జీవితంలో ది బెస్ట్ మూవీగా చెప్పవచ్చు. హీరోయిన్ ఓరియెంటెడ్ గానే కాకుండా హీరోయిన్ స్టార్ హీరోలతో రొమాన్స్ చేసి ఆకట్టుకుంది. మిగతా వారికంటే ప్రభాస్ తో అనుష్కకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ హీరోకు ఇవ్వని లిప్ లాక్ ప్రభాస్ (Prabhas) కు మాత్రమే ఇచ్చిందని అంటారు. అయితే ఇప్పుడు మరో హీరోతో కూడా లిప్ లాక్ సీన్ చేసిందట. ఆ లక్కీ హీరో ఎవరంటే?

 

‘సూపర్’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఫస్ట్ మూవీతోనే ఫేమస్ అయింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా గుర్తింపు రాలేదు. అయితే రాజమౌళి తీసిన ‘విక్రమార్కుడు’తో స్టార్ నటి అయింది. అప్పటి నుంచి అనుష్క చేస్తున్న సినిమాలు దాదాపు సక్సెస్ అయినవే అని చెప్పాలి. నాగార్జున, గోపీచంద్ లతో ఎక్కువగా సినిమాలు తీసిన అనుష్క ప్రభాస్ తో కలిసి మూడు సినిమాల్లో నటించింది. ఈ మూడు సక్సెస్ కావడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారన్న పుకార్లు బయటకు వచ్చాయి. ప్రభాస్ తో కలిసి బిల్లా, బాహుబలి సినిమాల్లో అనుష్క మెరిసింది. ఈ రెండు సినిమాల్లోనూ అనుష్క, ప్రభాస్ ల మధ్య లిప్ లాక్ సీన్ ఉంటాయి. ఇప్పటి వరకు ఏ హీరోతో ఇంతవరకు వెళ్లలేదు. ఒక్క ప్రభాస్ తో మాత్రమే ఈ సీన్ చేయడంతో ఆసక్తిగా చర్చ సాగింది.

కానీ ఇప్పుడు మరో హీరోతో అనుష్క లిప్ లాక్ సీన్ కు ఒప్పేసుకుందట. ఆ లక్కీ హీరో ఎవరో కాదు.. నవీన్ పోలిశెట్టి. వీరిద్దరు కలిసి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఎక్కువ వయసున్న అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఇందులో భాగంగా ఓ లిప్ లాక్ సీన్ అవసరం ఉంటుందని అనుష్కతో చెప్పగా వెంటనే ఒప్పేసుకుందట. దీంతో అనుష్కతో లిప్ లాక్ సీన్లో నటించే రెండో హీరోగా నవీన్ పొలిశెట్టి దక్కించుకున్నాడు. పి. మహేష్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలో వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతోంది.

Tags :
1657 views