Actress Sangeetha: హీరోయిన్ సంగీత కూతురు ఇప్పుడు ఎలా తయారు అయ్యిందో చూసారా..స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు!

Posted by venditeravaartha, May 22, 2023

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్ లు వస్తుంటారు పోతుంటారు కానీ కొందరు మాత్రమే ఎప్పటికి గుర్తు ఉండిపోతారు.అందులో ఒకరే సీనియర్ నటి ‘సంగీత'(Sangeetha).సంగీత చెన్నై లో ని ప్రముఖ నిర్మాత అయినా శాంతారాం ,భానుమతి ల కి జన్మించారు..ఈమె తాత గారు అయినా K. R. బాలన్ 20కి పైగా తమిళ చిత్రాలను నిర్మించిన నిర్మాత.చెన్నై లో చదువుకునే రోజుల్లోనే సంగీత కి డాన్స్ అంటే చాల ఇష్టం ఆ ఇష్టం తోనే భరత నాట్యం నేర్చుకున్నారు.అలా మొదట్లో డాన్సర్ గా సినిమా ల లోకి ఎంట్రీ ఇచ్చిన సంగీత ఆ తర్వాత కాలం లో హీరోయిన్ గా మారారు. 1997 లో రిలీజ్ అయినా మలయాళ చిత్రం ‘గంగోత్రి'(Gangothri) ద్వారా సినిమా ల లోకి ఎంట్రీ ఇచ్చారు సంగీత,ఆ తర్వాత కొన్ని మలయాళ ,తమిళ్ ,కన్నడ సినిమా ల లో చేసారు..తెలుగు లో మొదట సారిగా 2001 లో రిలీజ్ అయినా జేడీ చక్రవర్తి ‘నవ్వుతూ బతకలిరా’ సినిమా ద్వారా పరిచయం అయ్యారు.

Sangeetha in khadgam movie

సంగీత సినీ రంగప్రవేశం చేసిన 5 సంవత్సరాల వరకు తనకి సరైన పాత్రా కానీ ,గుర్తింపు కానీ దొరకలేదు.కానీ 2002 లో కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ‘ఖడ్గం'(Khadgam) సినిమా లో ఒక మంచి పాత్రా లో నటించారు సంగీత.సినిమా ల లో అవకాశం కోసం పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి సినిమా అవకాశాల కోసం ఏమైనా చేసే క్యారెక్టర్ లో సంగీత జీవించేసారు అని చెప్పొచ్చు.ఈ సినిమా లో తన నటనకు ఫిలిం ఫేర్ ,సినీ మా అవార్డ్స్ ని గెలుచుకున్నారు సంగీత.ఇక అప్పటి నుంచి వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు సంగీత.తెలుగు లో పెళ్ళాం ఊరెళితే ,ఈ అబ్బాయి చాల మంచోడు,ఆయుధం సినిమాల లో నటిస్తూనే తమిళ్ లో బాల డైరెక్షన్ లో వచ్చిన సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా ‘పితామగన్’ లో నటించారు.

Sangeetha in sivaputhrudu

ఇదే చిత్రం తెలుగు లో శివపుత్రుడు(Siva puthrudu) గా రిలీజ్ అయింది.ఈ చిత్రం లో విక్రమ్ కి భార్య కి నటించిన సంగీత మరోసారి ఫిలింఫేర్ ,తమిళనాడు స్టేట్ అవార్డు ని గెలుపొందారు.ఆ తర్వాత కొన్ని సినిమా ల లో నటించిన అవి ఆశించిన స్థాయి లో ఆడలేదు.ఇక ప్రముఖ సింగర్ మరియు యాక్టర్ అయినా క్రిష్ ని సంగీత 2009 లో పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమా ల కి దూరం గా ఉన్న సంగీత.తన సెకండ్ ఇన్నింగ్స్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బ్లాక్ బస్టర్ హిట్ అయినా ‘సరిలేరు నీకెవ్వరూ'(Sarileru nekevvaru) సినిమా తో స్టార్ట్ చేసారు.

Sangeetha in sarilerunekevaru

తన సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ స్టార్ మహేష్ గారితో నటించిన సంగీత ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారి ఆచార్య(Acharya) మూవీ లో కనిపించారు.తాను లీడ్ రోల్ లో చేసిన హార్రర్ మూవీ మాసూదా(Masooda) కూడా సూపర్ హిట్ అయింది.ఇక ఈ సంవత్సరం విజయ్  తమిళ్,తెలుగు లో రిలీజ్ అయినా వారిసు లో కూడా నటించారు సంగీత.సంగీత గారికి ఒక కూతురు ఉన్నారు ఆమె పేరు ‘శివియా’ ప్రస్తుతం స్కూలింగ్ చేస్తున్న తన కూతురు సంగీత గారి లాగానే మ్యూజిక్ ,డాన్స్ ల లో ఆసక్తి కలిగి ఉన్నారు.ఇక తన తల్లి నుంచి అందాన్ని,అభినయాన్ని అందుకున్న శివియా త్వరలోనే సినిమా లోకి ప్రవేశించనున్నారు అని సమాచారం.అయితే సంగీత తన కూతురిని మొదట గా తెలుగు చిత్రం ద్వారా పరిచయం చేయాలనీ చూస్తున్నారు.

Sangeetha with her family

956 views