CUSTODY: కస్టడీ మూవీ రివ్యూ !

Posted by venditeravaartha, May 12, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అక్కినేని నాగచైతన్య ,కృతి శెట్టి కలయిక లో బంగారాజు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం గా వచ్చిన చిత్రం ‘కస్టడీ’.తమిళ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు గారి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ ల లో శ్రీనివాస చిట్టూరి గారు నిర్మించారు.లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ‘ఇళయరాజ’ వారి కుమారుడు యువన్ శంకర్ రాజా గారు ఇద్దరు ఈ సినిమా కి మ్యూజిక్ ని కంపోజ్ చేసారు.ఇక ఇందులో ప్రధాన పాత్రల లో అరవింద్ స్వామి ,శరత్ కుమార్ ,ప్రియమణి ,వెన్నల కిషోర్ నటించారు.మరి వరుస ప్లాప్ ల లో ఉన్న అక్కినేని ఫ్యామిలీ నుంచి ఈ సారి చైతన్య హిట్ కొట్టాడా ! లేదా అనేది చూద్దాం.

కథ:శివ(నాగ చైతన్య ) నిజాయితీ కలిగిన ఒక పోలీస్ కానిస్టేబుల్ తాను పని చేస్తున్న పోలీస్ స్టేషన్ లో ఖైదీ గా ఉన్న రాజు(అరవింద్ స్వామి) ని పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుంటాడు అయితే రాజు ని చంపడానికి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ నుంచి మరి కొంత మంది తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు.తన స్టేషన్ నుంచి తప్పించుకున్న ఖైదీ ని తిరిగి ప్రాణాల తో తీసుకుని వచ్చి కోర్ట్ లో హాజరు పరచాలని శివ అనుకుంటాడు.ఇలాంటి సమయం లో తాను ఏ విధమైన పరిస్థితులను చూసాడు ,అసలు రాజు ని చంపాలని ఎవరు చూస్తున్నారు,తాను ప్రేమించిన రేవతి(కృతి శెట్టి) ఇష్టం లేని పెళ్లి కారణం గా బయటకి వచ్చేసి శివ తోనే ఉంటూ శివ అనుకున్న మిషన్ లో భాగం అవుతుంది.అసలు అరవింద్ స్వామి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎందుకు అయ్యాడు ,అతని చంపాలని ఎవరు చూస్తున్నారు ,పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నా అందరికి లేని అంతా నిజాయితీ ఒక సామాన్య కానిస్టేబుల్ అయినా శివ కి ఎందుకు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:ట్రైలర్ లో నాగ చైతన్య చెప్పినట్లు ఒక సారి న్యాయం వైపు నిలబడి చూడు ని లైఫ్ ఏ మారిపోతుంది అన్నట్లు సినిమా అంతటా తన డ్యూటీ కి న్యాయం చేస్తూ కనిపించే ఒక కానిస్టేబుల్ గా చైతన్య సూపర్బ్ నా నటించారు. చైతన్య నుంచి ఇది వరకు కొన్నియాక్షన్ సినిమా లు వచ్చిన అంతగా ఆడలేదు అవి ,కానీ ఈ సారి యాక్షన్ తో పాటు ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించారు చైతన్య . వెంకట్ ప్రభు మార్క్ స్క్రీన్ ప్లే ,మాటలు ఈ సినిమా కి మేజర్ అయ్యాయి.ఇక మాస్ట్రో ఇళయరాజా ,యువన్ శంకర్ ల మ్యూజిక్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచాయి.ఇది వరకు తాను చేసిన పాత్రా ల కు భిన్నం గా కృతి ఈ సినిమా లో కనిపించింది.మజిలీ తర్వాత ఆ స్థాయి కమర్షియల్ హిట్ నాగ చైతన్య కి కస్టడీ సినిమా ద్వారా లభించింది అని చెప్పొచ్చు.

పాజిటివ్ :కథ ,స్క్రీన్ ప్లే ,నాగ చైతన్య, ఫైట్స్ ,ఇంటర్వెల్ , క్లైమాక్స్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
నెగటివ్:స్లో ఫస్ట్ 30 మినిట్స్ .
రేటింగ్:4 / 5
చివరిగా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్.అక్కినేని ఫ్యాన్స్ కి పండగే.

1772 views