AKKINENI FAMILY : కొత్త చిక్కులో అక్కినేని ఫ్యామిలీ ! నాగ చైతన్య కాపాడగలడా ?

Posted by venditeravaartha, April 30, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో నేపోటిజం మీద చాల మంది చాల రకాలు గా విమర్శలు చేస్తూనే ఉంటారు,కానీ నేపోటిజం అనేది కేవలం ఒకరిని తక్కువ చేయడం కోసం ,వారి టాలెంట్ ని గుర్తించ లేకపోవడం వలెనే జరుగుతుంది అని అందరు అభిప్రాయ పడతారు,కానీ టాలెంట్ ని ఎవరు మాత్రం ఆపుతారు ,వారికి ఉన్న అవకాశాలని ఎవరు తగ్గించలేరు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున ,అఖిల్ ,నాగచైతన్య లు నటించిన సినిమా లు వరుసగా ప్లాప్ గా నిలిచాయి.

ఈ మధ్య కాలం లో నాగార్జున గారికి సరైన హిట్ లేదు ,2022 లో రిలీజ్ అయినా బంగరాజు హిట్ టాక్ వచ్చినప్పటికీ భారీ స్థాయి లో అయితే లాభాలను తెచ్చిపెట్టలేదు,తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన ‘ది ఘోస్ట్’ కూడా ఆశించిన స్థాయి లో ఆడలేదు.ఇక తన పెద్ద కుమారుడు అయినా నాగ చైతన్య తీసిన ‘థాంక్యు ‘ ,’లాల్ సింగ్ చందా’ సినిమా లు ప్లాప్ గా నిలిచాయి.రెండవ కుమారుడు అయినా ‘అఖిల్’ ఎప్పటి నుంచో ఒక భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు,తాను తీసిన 5 సినిమా లో ఏదైనా కొంచెం పర్లేదు అంటే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ ని చెప్పుకోవచ్చు.

2 ఇయర్స్ ఎంతో కష్టపడి చేసిన ‘ఏజెంట్’ మూవీ కూడా నిరాశపరిచింది.ఇక తన 6 వ సినిమా కోసం అఖిల్ ఇప్పటి ముంచే కసరత్తులు చేస్తున్నారు.గడిచిన సంవత్సర కాలం లో అక్కేనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన 3 సినిమా లు డిసాస్టర్ లు గా నిలిచాయి,దీనికి కారణం హీరో లు సెలెక్ట్ చేసుకుంటున్న కథ లా లేక డైరెక్టర్ లా అనేది అర్ధం కావడం లేదు.ఒక సారి వీరు పని చేసిన డైరెక్టర్ లా ని పరిశీలిస్తే ఘోస్ట్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఇది వరకు ‘గుంటూరు టాకీస్’,’గరుడ వేగా’ లాంటి బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి,ఇక థాంక్యు డైరెక్టర్ ‘విక్రమ్ కే కుమార్’ కి మనం ,24 ,ఇష్క్ ,గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ లు ఉన్నాయ్.ఇక అఖిల్ తో ఎంతో ప్రెస్టీజియస్ గా తీసిన ఏజెంట్ మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి గురించి తెలిసిందే.పెద్ద పెద్ద డైరెక్టర్ లు అయి కూడా అక్కినేని వారికి హిట్లు పడలేదు అంటే లోపం ఎక్కడ ఉంది ? కథ పరం గా కూడా అన్ని మంచి సినిమా లే ! ఆయన హిట్ లభించలేదు.ఇక త్వరలో రిలీజ్ కానున్న చైతన్య ‘కస్టడీ’ సినిమా అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి.

643 views