YSRCP-RAJINIKANTH:వైసీపీ వాళ్ళు చేప్తున్నట్లు నిజం గానే రజినీకాంత్ సీనియర్ ఎన్టీఆర్ కి ద్రోహం చేసారా !

Posted by venditeravaartha, April 30, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం అయినా నందమూరి తారక రామారావు గారి 100 వ జయంతి ఉత్సవాల లో సందర్భముగా విజయవాడ లో ఏర్పాటు చేసిన సభ లో సూపర్ స్టార్ రజినీకాంత్ గారు మాట్లాడిన స్పీచ్ కి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయినా వైస్సార్సీపీ ఎమ్మెల్యే,మినిస్టర్ లు ఒక్క సరిగా అందరు రజినీకాంత్ గారి మీద నెగటివ్ ప్రచారాలు చేస్తున్నారు,అయన మాట్లాడిన మొత్తం స్పీచ్ లో వైసీపీ పార్టీ ని కానీ ,వారి ప్రభుత్వాన్ని కానీ అయన ఒక్క మాట కూడా అనలేదు.మరి ఎందుకు వైసీపీ వారు అయన ని తిడుతున్నారో,వైసీపీ వారికి సూపర్ స్టార్ రజినికాంత్ గారిని తిట్టే అంతా స్థాయి ఉందా అనేది ఇప్పుడు చూద్దాం !

సహజం గా మనల్ని ఎవరు అయినా ఏదైనా ఫంక్షన్ కి కానీ ,లేదా రాజకీయ సభ ల కి కానీ పిలిచినప్పుడు మాక్సిమం మనం వారి గురించి ఉన్న గుడ్ థింగ్స్ మాట్లాడుతాం,అందులోను కొంచెం సమాజం లో పేరు ,ప్రతిష్టలు కలిగిన వారి గురించి అయితే ఇంకా చెప్పాలిసిన పని లేదు,అదే చేసారు రజినీకాంత్ గారు.తన అభిమాన నటుడు అయినా సీనియర్ ఎన్టీఆర్ గారి 100 వ జయంతి ఉత్సవాల కి హాజారు అయినా ఆయన ,ఎన్టీఆర్ గారి తో తనకి ఉన్న పరిచయం ,అయన తో పని చేసిన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు.ఇక్కడ తో మంచిగానే ఉన్నారు,కానీ స్టేజి మీద ఉన్న బాలకృష్ణ ,చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలని పట్టుకుని రజినికాంత్ గారిని విపరీతం గా తిడుతున్నారు వైసీపీ వాళ్ళు.

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తో 30 ఇయర్స్ నుంచి స్నేహం ఉంది అని,,ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చిన ఆయన ని కలుస్తా అని అన్నారు,చంద్ర బాబు నాయుడు గారి తో మాట్లాడిన ప్రతి సారి తనకి ఏదో నేర్చుకున్నట్లు ఉంటుంది అని ,అయన ఒక గొప్ప విషనరీ కలిగిన నాయకుడు అని ,దేశం లో ఉన్న వారి కంటే విదేశాల లో ఉన్న వారికి చంద్రబాబు గారి నాయకత్వం గురించి ,అయన డెవలప్మెంట్ గురించి బాగా తెలుసు అన్నారు,జైలర్ సినిమా షూటింగ్ లో హైదరాబాద్ లో ఉన్నపుడు 22 ఇయర్స్ బ్యాక్ చుసిన హైదరాబాద్ కి ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్ కి చాల తేడా ఉంది అన్నారు.అయన ముఖ్యమంత్రి గా చేసిన 1995 -2004 కాలం లా లో IT ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి ఎంతగానో కృషి చేసారు అని ,ఇప్పుడు ఆ డెవలప్మెంట్ ని కెసిఆర్ గారు నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తున్నారు అని కొనియాడారు.పైన రజినికాంత్ గారు మాట్లాడిన దాంట్లో కనీసం 80 % అయినా నిజం ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే కానీ వైసీపీ వారు ఎందుకు తిడుతున్నారు,ఏ విషయం మీద తిడుతున్నారు.

ఎన్టీఆర్ నా అభిమాన నటుడు ,అయన దేవుని స్వరూపం ,యుగ పురుషుడు అని పొగిడిన రజినికాంత్ ,1995 ఆగష్టు 26 నా వైస్రాయ్ హోటల్ లో జరిగిన విషయం లో చంద్ర బాబు నాయుడు కి సపోర్ట్ గా ఎందుకు హోటల్ లో ఉన్నారు,ఆ రోజు చంద్ర బాబు నాయుడు తెలుగు దేశం పార్టీ ని లాక్కుని ఎన్టీఆర్ గారికి వెన్ను పోటుపొడిచిన సందర్భం లో ప్రత్యక్షం గా చంద్రబాబు కి ఎందుకు సపోర్ట్ చేసావు,నువ్వు తమిళ్ నాడు నుంచి వచ్చి ఇక్కడ రాజకీయ లా గురించి మాట్లాడేసి పోతే మేము ఉరుకోము అని వైసీపీ నాయకులూ అయన మీద నెగటివ్ వ్యాఖ్యల తో విరుచుకుని పడుతున్నారు.యావత్ ప్రపంచం అంతా అభిమానులు కలిగి ఉన్న ఒక సూపర్ స్టార్ ని ,అయన మిమ్మల్ని ఒక్క మాట కూడా అనకపోయినా అయినా మీద విష ప్రచారం ఎందుకు చేస్తున్నారు అని కొంత మంది వైసీపీ వాళ్ళ మీద కౌంటర్ లు వేస్తున్నారు.

661 views