NTR: అంత చిన్న సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేయడానికి కారణం?

Posted by venditeravaartha, July 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి స్థాయి పాన్ ఇండియన్ స్థాయి కి ఎదిగింది ఇక ఆయన ప్రస్తుతం కొరటాల శివ గారి డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే పాన్ ఇండియన్ సినిమా గా రానున్న ఈ సినిమా లో బాలీవుడ్ నుంచి సైఫాలీ ఖాన్,జాహ్ణవి కపూర్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా తరువాత కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 లో చేస్తారు..దేవర ,ఎన్టీఆర్ 31 ల తో పాటుగా బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో కూడా ఎన్టీఆర్ చేయనున్నారు.ఇలా బిజీ బిజీ షెడ్యూల్ ల తో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక చిన్న సినిమా లో గెస్ట్ రోల్ చేస్తున్నారు అంటూ న్యూస్ హల్చల్ చేస్తుంది.

ntr hritik

నారా రోహిత్ , కోట శ్రీనివాస రావు ,పోసాని కృష్ణ మురళి ,శ్రీ విష్ణు ప్రధాన పాత్రా లో 2014 లో రిలీజ్ అయినా ప్రతినిధి సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ క్రిటికల్ గా మంచి సక్సెస్ అయింది.ప్రభుత్వం లో జరిగే చిన్న చిన్న తప్పుల వలన జరిగే పెద్ద సమస్యలను కంటికి కనిపించేలా చూపించారు.అయితే ప్రస్తుతం ఈ సినిమా కి సీక్వెల్ రానుంది.టీవీ 5 న్యూస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జర్నలిస్ట్ మూర్తి తన 30 సంవత్సరాల జర్నలిస్ట్ కెరీర్ లో తాను చుసిన విషయాలని కథ గా రాసుకుని ఇప్పుడు దానిని ఇప్పుడు సినిమా గా చేస్తున్నారు.తన కథ ని నమ్మిన నారా రోహిత్ ప్రతినిధి 2 లో తానే హీరో గా చేస్తున్నారు.

prathinidhi

నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా ప్రతినిధి 2 కి సంబందించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు ఒక మనిషి అన్ని వైపులా నుంచి వస్తున్న ప్రతికూల పరిస్థితులని తట్టుకుని ఇలా నిలబడతారు అనే పాయింట్ ని బేస్ చేసుకుని ప్రతినిధి 2 ని చేస్తున్నారు.ఇక ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్రా లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నట్లు సమాచారం.అయితే గత కొంత కాలం నుంచి నారా ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్నా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా లో చేయడానికి గల కారణం ఏంటో తెలియాల్సి వస్తుంది.మూర్తి లాంటి కొత్త డైరెక్టర్ ని నమ్మి ఎన్టీఆర్ ఈ సినిమా లో చేయడం ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది.

ntr rohit

2636 views