Pawan kalyan: పవన్ కళ్యాణ్ గారి వలన మాకు ఎటువంటి లాభం లేదు:దిల్ రాజు

Posted by venditeravaartha, August 1, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ ల లో దిల్ రాజు గారు ఒకరు..మొదట డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ అయినా ఈయన కెరీర్ ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ని స్థాపించి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు.తన బ్యానేర్ లో 50 సినిమా ల ను పూర్తి చేసిన దిల్ రాజు ఇండస్ట్రీ లో ని అందరు స్టార్ హీరో ల తో సినిమా లను చేసారు.దిల్ సినిమా తో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛంజేర్ వరకు తన ప్రయాణం కొనసాగుతోంది.ఇటీవల జరిగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల లో ప్రెసిడెంట్ గా గెలిచినా దిల్ రాజు గారు తన అభిమాన హీరో గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి ని రేకెత్తిస్తున్నాయి.

pawan and dil raju

దిల్ రాజు గారు ఎప్పటి నుంచో తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారి తో సినిమా చేయాలి అని అంటూ ఉండే వారు ఆయన కోరిక ని వకీల్ సాబ్ తో నెరవేర్చుకున్నారు.అయితే సినిమా రిలీజ్ సమయం లో దిల్ రాజు గారు ఎదుర్కున్న సమస్యలు అంత ఇంత కాదు.పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు గా ఆంధ్ర ప్రాంతం లో జరుగుతున్న అన్యాయాల గురించి సినిమా ఇండస్ట్రీ మీద జగన్ ప్రభుత్వం చేసిన ఆంక్షల మీద ప్రతీకారం గా వైసీపీ ప్రభుత్వం
బెనిఫిట్ షో లు ,టికెట్ రేట్లు తగ్గించి ఆయన సినిమా ల ని ఆర్ధికంగా దెబ్బ కొట్టారు.అయితే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పటికీ అప్పటి పరిస్థితుల నేపథ్యం లో ప్రొడ్యూసర్ కి నష్టాలు వచ్చాయి.ఇక ఆ తర్వాత రిలీజ్ కి రెడీ గా ఉన్న పెద్ద సినిమా ల కోసం దిల్ రాజు మిగిలిన ప్రొడ్యూసర్ లు ప్రభుత్వం తో సమావేశం అయినా సంగతి తెలిసిందే.

dil raju

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ఇండస్ట్రీ గురించి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వాటి గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సీరియస్ అయినా జగన్ అతని టీం పాత రేట్ల తో సినిమా టికెట్ ల ను తీసుకుని వచ్చింది ఇక ఈ విషయం మీద చిరంజీవి ఇంకా మహేష్ ,ప్రభాస్ తో పాటు మరి కొంత మంది జగన్ ని కలిసి టికెట్ రేట్లు ,బెనిఫిట్ షో ల మీద చర్చించారు.అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్ కి సినిమా ల కి ఇండస్ట్రీ కి లింక్ పెట్టొద్దు అని దిల్ రాజు గా అన్నారు.

1264 views