Gaami Review: విశ్వక్ సేన్, లవ్ స్టోరీ లతోపాటు విభిన్న కథలలో నటిస్తూ తనప్రతిభను నిరూపించుకోవడానికి ఎప్పుడూ ముందుంటాడు.ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యి ఇప్పుడు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ‘గామి’ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.ఈ మూవీ ప్రేక్షకుల్లో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాన్ని బాగా పెంచేసింది విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని టాక్ వచ్చింది. ఇక థియేటర్లో ఎప్పుడు చూస్తామని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా, ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా విశ్వక్ సేన్, చాందిని చౌదరి అభినయ, హారిక,తారాగరం నటించారు. విద్యాధర కాగితాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కార్తీక్ శబరీష్ శ్వేత మేరవనేని నిర్మాతలుగా ఈ మూవీని తెరకెక్కించారు.ఈ సినిమా మీద విశ్వక్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక కథలోనికి వెళ్తే.
కథ :
శంకర్ (విశ్వక్ సేన్ )హరిద్వార్ లో ఉండే ఒక అఘోర.ఇతను ఒక వింత సమస్యతో బాధపడుతూ ఉంటారు ఎవరైనా టచ్ చేస్తే ఇతని శరీరం నీలం రంగులోకి మారిపోతుంది.వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాడు.వింత రోగం ఉందని మిగిలిన అఘోరాలు శంకర్ ని ఆశ్రమం నుంచి వెళ్లగొడతారు. సమస్య పరిష్కారం కోసం శంకర్ కాశీ వెళ్తాడు అక్కడ సాధువు సమస్యకు పరిష్కారం చెప్తాడు హిమాలయాల్లో 36 సంవత్సరాలకు ఒకసారి లభించే మాలి పత్రాలతో వైద్యం చేయాలని చెప్తాడు దీంతో శంకర్ హిమాలయాలకు పయనం మొదలు పెడతాడు. ఇతనితో జాహ్నవి (చాందిని చౌదరి ) కూడా తోడుగా వెళ్తుంది మరి శంకర్ హిమాలయాలు చేరుకున్నాడా శంకర్ కలలో వస్తున్న ఉమ( హారిక పెద్ద) సిటీ-333( మహమ్మద్ సయ్యద్ ) అసలు ఎవరు ముగ్గురి కథగా ముందుకు వచ్చి చివరిలో ట్విస్టుతో ముగించే ‘గామి’ సినిమా ఎలా ఉందో తెలియాలంటే థియేటర్లలో చూడాల్సిందే.
ఈ మూవీ విశ్వక్ సేన్ ప్రయత్నం అని చెప్పొచ్చు. ఈ మూవీలో తన నటన నీట్ గా ఉందని చెప్పొచ్చు అఘోర పాత్రలో న్యాయం చేశాడు ఈ మూవీ లో హీరో తో పాటు నటించిన మిగిలిన తారాగణం కూడా సినిమాలో మెప్పిస్తారు ఇక కొంత లాజిక్స్ ని పక్కన పెడితే ఈ శివరాత్రికి ఈ మూవీ ప్రేక్షకులకు కొంతమేర డీసెంట్ ట్రీట్ అందిస్తుంది అని చెప్పొచ్చు.