Varun : లావణ్య కంటే ముందే ఆ హీరోయిన్ వరుణ్ ప్రేమించి పెళ్లి దాకా వెళ్లాడా.. ఆయన వార్నింగ్ తోనే వెనక్కి తగ్గాడట

Posted by RR writings, October 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Varun : మెగా ఫ్యామిలీలో త్వరలో భాజా భజంత్రీలు మోగనున్నాయి. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్లి అతి తొందర్లోనే జరుగనుంది. ఈ విషయంపై మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వరుణ్ లావణ్యల పెళ్లి జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. వారిద్దరు ఐదేళ్లపాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. వీళ్ళ ఎంగేజ్మెంట్ జూన్ 9న నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. వరుణ్, లావణ్య నిశ్చితార్థం ఫోటోలను ఇప్పటికే అభిమానులు షేర్ చేస్తున్నారు. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్, లావణ్య వాళ్ళ పెళ్లికి కావాల్సినవన్నీ దగ్గరుండి వాళ్లే చూసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఫారిన్ కెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ లో వీళ్ళ పెళ్లి జరుగుతుందని అంటున్నారు.

ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గర నుంచి ప్రతి వైరల్ అవుతూనే ఉంది. డ్రెసింగ్, కాస్టూమ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్ తెగ వైరల్ అవుతున్నారు. ఇటలీలో వీరి వివాహం జరుగనుంది. ప్రస్తుతం వరుణ్ కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లావణ్య, వరుణ్ లు అంతకు ముందే వారిద్దరు మరొకరితో రిలేషన్ షిప్ మెయింటైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై ఎవరూ స్పందించలేదు. వరుణ్ లావణ్య కంటే ముందే మరొకరితో రిలేషన్ లో ఉన్నారట. అన్నీ కుదిరితే ఆ అమ్మాయే మెగా ఇంటికి కోడలిగా రాబోతుంది అనే వార్త వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఆయన మొదటి సినిమాలో నటించిన ముకుంద.. హీరోయిన్ పూజ హెగ్డే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ముకుంద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా ఈ పెయిర్ కు మంచి మార్కులే పడ్డాయి.

ఈ సినిమా షూటింగ్ టైంలో వారిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తుందనే టాక్ వినిపించింది. ఆ సమయంలో వారిద్దరూ గిప్టులు ఇచ్చి పుచ్చుకునే వారని, ఆ తర్వాత పార్టీలకు పబ్బులకు వెళ్లేవారని టాక్ వచ్చింది. అంతేకాదు వరుణ్ కూడా పూజాను పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ ఈ విషయం తెలిసిన నాగబాబు వరుణ్ కు వార్నింగ్ ఇచ్చారట. మొదటి సినిమాతోనే లవ్, రిలేషన్ అంటూ కెరీర్ నాశనం చేసుకుంటావా.. ఇది నీకు ఫస్ట్ సినిమానే ముందు కెరీర్లో సెటిల్ అవ్వు అంటూ హెచ్చరించారట. దీంతో వరుణ్ ఏం చేయలేకపోయాడనే టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతం మరో సారి ప్రేమలో పడి ఇష్టపడ్డ అమ్మాయినే వరుణ్ పెళ్లి చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.

140 views