టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో జంట రియల్ లైఫ్ లో ఒక్కటి కాబోతుంది. మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ), హీరోయిన్ లావణ్య త్రిపాఠి ( lavanya tripathi )లు కొద్దికాలంగా ప్రేమించుకున్నారు. ఇటీవల వీరు అతికొద్ది మంది సమక్షంలో నిశ్చితార్థం జరుకున్నారు. అయితే లావణ్య, త్రిపాఠిల ప్రేమ ఎక్కడ మొదలైంది? వీరు ఎలా ప్రేమించుకున్నారు? అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఏదీ ఎలా ఉన్నా వరుణ్ తేజ్ , లావణ్యలు ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగి ఇద్దరూ ఒకేసారి తమ లవ్ ప్రపోజ్ చేశారని అనుకుంటున్నారు. అయితే లావణ్య త్రిపాఠిలో కొన్ని విషయాలు వరుణ్ ను బాగా ఇంప్రెస్ చేశాయట. ఎదుటి వారి విషయంలో ఆమె అలా ప్రవర్తించినందుకే ఆమెపై మనసు పారేసుకున్నాడట. ఇంతకీ అసలు విషయమేంటంటే?
వరుణ్ తేజ్, లావణ్యలు మొదటిసారి ‘మిస్టర్’ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ తరువాత ‘అంతరిక్షం’ అనే మూవీలో మరోసారి కలిసి పనిచేశారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. అయితే చాలా మంది సినీ సెలబ్రెటీల లవ్ విషయం ఇలా మొదలు కాగానే.. అలా బయటకు వస్తుంది. కానీ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల లవ్ విషయం దాదాపు ఏడేళ్ల తరువాత గానీ బయటకు రాలేదు. ఇటీవల జరిగిన వీరి నిశ్చితార్థాన్ని కూడా పెద్దగా హడావుడి చేయకుండా సీక్రెట్ గా జరిపించారు. అయితే మీడియాలో పడడం ఇష్టం లేకనే వీరు ఇలా చేశారని అంటున్నారు. అయితే లావణ్యలోని కొన్ని విషయాలు వరుణ్ తేజ్ కు బాగా నచ్చాయట. కొన్నాసార్లు ఆమె ప్రవర్తన చూసి వరుణ్ ఆశ్చర్యపోయాడట. తనలో ఇంత మంచి గుణాలు ఉండడం చూసి మురిసిపోయాడట. అందుకే ఆమె అంటే విపరీతంగా ఇష్టం ఏర్పడిందట.
ఇతరులతో కలుపుగోలు తనంలో లావణ్యకు ఎక్కువగా ఇష్టం. కొత్త వ్యక్తలు, పాత వ్యక్తులు అని తేడా లేకుండా అందరినీ రిసీవ్ చేసుకునే మనస్తత్త్వ ఉండడం తన అదృష్టం అని వరుణ్ అనుకున్నట్లు సమాచారం. ఇక ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిపరెన్ష్ ఇచ్చే విషయంలో లావణ్య ఏమాత్రం కాంప్రమైజ్ కాదట. అంతేకాకుండా పెళ్లయిన తరువాత సినిమాలు మానుకుంటానని, లావణ్య ముందే చెప్పడంతో వరుణ్ మరింత ఇంప్రెస్ అయ్యాడట.