UPASANA:కొంతమంది చరణ్ కేవలం డబ్బులు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు అన్నారు ! ఉపాసన సంచలన వ్యాఖ్యలు

Posted by venditeravaartha, April 2, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా అరంగేట్రం చేసిన కొన్ని సంవత్సరాల కె అపోలో హాస్పిటల్స్ అధినేత అయినా ప్రతాప్ సి రెడ్డి గారి మనవరాలు ఉపాసనను 2012 జూన్ 14న అంగరంగా వైభవంగా జరిగింది. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.ఇక ఇటీవల లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ వేడుకలకు చెర్రీతో కలిసి ఉపాసన కూడా సందడి చేశారు. అంతేకాకుండా,ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ షూటింగ్ జరుపుతున్నప్పుడు చరణ్ వెంటే ఉన్నారట ఉపాసన. ఆ సమయంలో తన భర్తకు మానసికంగా ధైర్యం ఇచ్చానని, చరణ్ సైతం తనకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఉపాసన,అంతేకాకుండా తన ప్రతి విజయంలో చరణ్ మద్దతుగా ఉన్నాడని కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నా తాము, ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యమన్నారు.

తమ ఇన్నాళ్ల పరిచయం లో రామ్ చరణ్ దగ్గర నుంచి చాల నేర్చుకున్నాను,ప్రేమ గా ఎలా ఉండాలి ,ఎంత పెద్ద ప్రాబ్లెమ్ వచ్చిన దానిని ఎలా ఎదుర్కొనాలి అనేవి తన దగ్గరనుంచి నేర్చుకున్నాను అని అన్నారు, ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకలు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలని తెలిపారు. అంతేకాకుండా,పెళ్లైన కొత్తలో తాను ఎదుర్కొన్న విమర్శల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తమ లవ్ మ్యారెజ్ పై ఓపెన్ అయ్యారు.ఉపాసన మాట్లాడుతూ చరణ్ నేను కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నాం.మా స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. మా ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు,కానీ ఒకరిపై ఒకరికున్న నమ్మకం, గౌరవం, ప్రేమతో ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ నన్ను ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉన్నారు.

సమాజంలో చాలా మంది ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నవారే. నా పెళ్లైన కొత్తలో నేను బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నాను,నేను బాగా లావుగా ఉన్నానని అందంగా లేనని కామెంట్స్ చేశారు. మరికొందరు చరణ్ కేవలం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని అన్నారు. మామయ్య చిరంజీవి గారు లెజెండ్ ,ఆయన కి కోడలిగా మెగా ఫ్యామిలీ లోకి అడుగు పెట్టాలి అంటే అదృష్టం ఉండాలి,రామ్ చరణ్ లాంటి అర్ధం చేసుకునే భర్త దొరకడం కూడా చాల అరుదు,అంత బిజీ షూటింగ్ లు,వ్యాపారాలు ల తో ఉంటూ ఫ్యామిలీ కి సమయం ఇవ్వడం అంటే మాములు విషయం కాదు, అందుకే ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసిన ఆ సమయంలో నేను కుంగిపోలేదు. ధైర్యంగా వాటిని జయించాను. ఆరోజు నన్ను ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

738 views