డొక్కా సీతమ్మ క్యాంటీన్లో భోజనాలు తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహన

Posted by venditeravaartha, October 1, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

కాకినాడ జిల్లా జగ్గంపేట అక్టోబర్ 1: నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ ను నిర్వహించారు. నేడు ఈ ఉచిత క్యాంటీన్ కు ఉప్పలపాడు గ్రామస్తులు మేడిబోయిన గోవిందరాజులు సత్యవతి (లేటు) దంపతుల కుమారులు మేడిబోయిన శీను బ్రదర్స్ ఆర్థిక సహాయంతో జరిగింది. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర అన్నపూర్ణగా డొక్కా సీతమ్మ పేరుగాంచిందని అన్నారు. ప్రతిరోజు ఎంతోమందికి అన్నదానం స్వయంగా డొక్కా సీతమ్మ నిర్వహించేదని అన్నారు. ఆ మహాతల్లి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రతి మంగళవారం తమ వంతు బాధ్యతగా ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మేడిబోయిన శ్రీను అంకం ఓం కృష్ణ సత్తి సోమరాజుదూది బ్రదర్స్ తలాటం సూరిబాబు అడబాలు బాబురావు మాదారపు వీరబాబు మరిసే రామకృష్ణ దొడ్డ శ్రీను సూరపురెడ్డి నరేష్ రేవూరి శ్రీనివాస్ బచ్చల రాజు సుంకర శ్రీనివాస్ అడబాల వీరబాబు దాడి మణికంఠ గొలగాని లోవరాజు రాజనాల శ్రీను జట్ల భద్ర జన సైనికులు పాల్గొన్నారు.

Tags :
51 views