TRIVIKRAM-DSP: కేవలం ఆ కారణం వలనే త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ ని దూరం పెట్టాడా ! బయట పడ్డ అసలు నిజం!

Posted by venditeravaartha, May 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమా ల లో కాంబినేషన్ అనేది చాల ముఖ్యమైంది అది హీరో ,హీరోయిన్ అవ్వవచ్చు లేక హీరో ,డైరెక్టర్ కావొచ్చు,తెర మీద కనిపించే వారి కాంబినేషన్ వలనే అన్ని సినిమా లు హిట్ కావు కొన్ని సినిమా ల కి బ్యాక్ ఎండ్ లో పని చేసే వారి కాంబినేషన్ కూడా చాల ప్రభావం చూపిస్తుంది,అలాంటి కాంబినేషన్ ల లో ఒకటి డైరెక్టర్ ,మ్యూజిక్ డైరెక్టర్.మూవీ లో కథ ని డైరెక్టర్ ఎంత మంచిగా చూపిస్తారో ,కథ కి ఆ సినిమా లో సాంగ్స్ కూడా చాల ప్రభావితం చేస్తాయి.ప్రెసెంట్ ఉన్న మన టాలీవుడ్ లో కొంత మంది డైరెక్టర్ లు వాళ్ళ మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేసి సక్సెస్ అయ్యారు. ఆ కాంబినేషన్ ల లో రాజమోళి -కీరవాణి మరియు కొరటాల శివ -దేవి శ్రీ ప్రసాద్,సుకుమార్ -దేవి శ్రీ ప్రసాద్.

రాజమౌళి ,సుకుమార్ ,కొరటాల శివ మాదిరిగానే త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas) గారు కూడా దేవి శ్రీ ప్రసాద్(DSP) గారితో మంచి కాంబినేషన్ కలిగి ఉన్నారు..నువ్వే నువ్వే సినిమా తో డైరెక్టర్ అయినా గురూజీ ఆ సినిమా కి కోటి గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు ,మహేష్ బాబు గారితో తీసిన ‘అతడు’ ,’ఖలేజా’ సినిమా ల కి మణిశర్మ మ్యూజిక్ చేసారు.అయితే మెగా ఫ్యామిలీ తో ‘జల్సా’,’జులాయి’,’అత్తారింటికి దారేది’,’సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమా ల కు వరుసగా దేవి శ్రీ ప్రసాద్ గారు పనిచేసారు.వీరి కాంబినేషన్ లో వచ్చిన నాలుగు సినిమా ఆల్ టైం బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.అయితే ఆ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ ,త్రివిక్రమ్ కలిసి పని చేయలేదు.

‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమా సమయం లో ఒక సాంగ్ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వీరి ఇద్దరికీ బేధాభిప్రాయాలు వచ్చాయి అని ఆ సినిమా అయిపోయాక త్రివిక్రమ్ ,దేవి శ్రీ ప్రసాద్ లు ఆ సినిమా ప్రొమోషన్ ల లో కూడా కలిసి కనించలేదు.నితిన్ తో తీసిన ‘అ ఆ ‘ సినిమా కి కూడా దేవిశ్రీ ప్రసాద్ నే ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుని ఆ తర్వాత ఆయన్ని తప్పించి మిక్కీ జే మేయర్ ని తీసుకున్నారు.ఎన్టీఆర్ సినిమా కి థమన్ తో చేయించుకున్న త్రివిక్రమ్.తన స్నేహితుడు అయినా పవన్ కళ్యాణ్ గారికి జల్సా ,అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ ని కాదు అని అనిరుద్ ని తీసుకున్నారు.’అజ్ఞాత వాసి ‘ సినిమా తర్వాత దేవి శ్రీ ప్రసాద్ కి త్రివిక్రమ్ కి మధ్య ఉన్న వివాదాలు ఇంకా ఎక్కువ అయ్యాయి అనే చెప్పాలి.ఇక రాబోయే సినిమా ల లో అయినా త్రివిక్రమ్ ,దేవి శ్రీ ప్రసాద్ కలిసి ఒక్క సినిమా అయినా చేయాలి అని కోరుకుందాం.

4371 views