TOLLYWOOD:ఓవర్సీస్ లో గ్లోబల్ స్టార్స్ ని మించిపోయిన నాని!

Posted by venditeravaartha, March 31, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

USA లో ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే దాదాపుగా ర్యాలీలు హంగామా రచ్చ చేస్తారు మన వారు అక్కడ. ఈ యూఎస్ మార్కెట్ ని ఓపెన్ చేసిన హీరో మాత్రం మహేష్ బాబు అనే చెప్పాలి, 2011లో వచ్చిన దూకుడు సినిమాతో యూఎస్ మార్కెట్ ని కొల్లగొట్టాడు. అప్పటి నుంచి మన సినిమాలకు అక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. అక్కడ $1 మిలియన్ క్లబ్ లో చేరడం కూడా ఒక రికార్డ్. తెలుగు ఇండస్ట్రీ లో మహేష్ బాబు గారికి అత్యధికంగా $1 మిలియన్ సినిమా లు ఉన్నాయి,అయితే తన తర్వాతి ప్లేస్ లో మాత్రం ఒక టైర్ 2 ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది,మెగాస్టార్ లు ,పవర్ స్టార్ లు ,యంగ్ టైగర్ ,ఐకాన్ స్టార్ ల కి సాధ్యం కానిది న్యాచురల్ స్టార్ కి సాధ్యం అయింది .మహేష్ బాబు ,నాని ల తో పాటు ఏ హీరోల సినిమాలు ఎన్ని ఆ $1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేశాయో చూద్దాం.

మహేష్ బాబు (11):సూపర్ స్టార్ మహేష్ బాబు ,శ్రీను వైట్ల గారి కలయిక లో వచ్చిన దూకుడు (2011 ) బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాకుండా 100 కోట్ల గ్రాస్ సాధించిన తొలి సినిమా గా రికార్డు సృష్టించింది,ఇక దూకుడు తెలుగు రాష్ట్రాల తో పాటు అమెరికా లోను మంచి కలెక్షన్ లు రాబట్టింది,ఈ సినిమా తోనే టాలీవుడ్ నుంచి మొదటి 1 మిలియన్ డాలర్ ల కలెక్షన్ వచ్చాయి,ఇక తరువాత వరుస గా దూకుడు (2011), ,SVSC(2013), ఆగడు (2014),1–నేనొక్కడిన్ (2014),శ్రీమంతుడు (2015), బ్రహ్మోత్సవం (2016), స్పైడర్ (2017), భరత్ అనే నేను (2018), మహర్షి (2019),సరిలేరు నీకెవ్వరు (2020),సర్కారు వారి పాట(2022) ల తో టాప్ లో ఉన్నారు మహేష్ బాబు.

నాని(8):అష్ట చమ్మ సినిమా తో తెలుగు సినిమా కి పరిచయం అయినా నాని ,తర్వాత తనకుంటూ ఒక ఇమేజ్ ని సెట్ చేసుకుని న్యాచురల్ స్టార్ గా ఎదిగారు,రాజమౌళి గారి ఈగ (2012 ) సినిమా తో తన మొదటి 1 మిలియన్ డాలర్ ల మార్క్ ని అందుకున్న నాని ,ఆ తర్వాత కాలం లో వరుసగా ఈ ఫీట్ ని సాధించి సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత స్థానం లో ఉన్నారు,ఈగ (2012),భలే భలే మగాడివోయ్ (2015),జెంటిల్ మాన్(2016),నిన్ను కోరి (2017),MCA (2017),నేను లోకల్ (2017),జెర్సీ (2019),దసరా(2023).

జూనియర్ ఎన్టీఆర్(7):జూనియర్ ఎన్టీఆర్ ,శ్రీనువైట్ల కాంబినేషన్ లో 2013 వచ్చిన బాద్‌షా తో 1 మిలియన్ డాలర్ మార్క్ ని అధిగమించిన ఎన్టీఆర్ ఇక వరుస సినిమా ల అయినా బాద్‌షా (2013),టెంపర్ (2015),నాన్నకు ప్రేమతో (2016),జనతా గ్యారేజ్ (2016),జై లవ కుశ (2017),అరవింద సమేత (2018),ఆర్ ఆర్ ఆర్ (2022) ల తో ఈ ఫీట్ ని సాధించారు,2018 నుంచి 2022 వరకు సినిమా ల ఏమి కూడా నటించలేదు జూనియర్ ఎన్టీఆర్ ,ఒక వేళా ఆ టైం లో 2 సినిమా ల చేసి ఉన్న టాప్ 2 లో ఉండే వారు.

పవన్ కళ్యాణ్ (6 ):మహేష్ బాబు గారి తర్వాత 1 మిలియన్ మార్క్ అందుకున్న హీరో పవన్ కళ్యాణ్ గారు ,హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ (2012 ) తో ఈ ఫీట్ అందుకున్నారు ,తర్వాత వరుసగా గబ్బర్ సింగ్ (2012),అత్తారింటికి దారేది (2013),సర్దార్ గబ్బర్ సింగ్ (2016),కాటమరాయుడు (2017),అజ్ఞాతవాసి (2018),భీమ్లా నాయక్ (2022),2018 నుంచి 2021 వరకు పవన్ కళ్యాణ్ గారు సినిమా ల కి దూరం గా ఉన్నారు.

అల్లు అర్జున్(5) :అల్లు అర్జున్ ,సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్ లో 2014 లో రిలీజ్ అయినా రేస్ గుర్రం సినిమా తో తన మొదటి 1 మిలియన్ మార్క్ ని అందుకున్న అల్లు అర్జున్ వరుస గా రేస్ గుర్రం (2014), S/O సత్యమూర్తి (2015), దువ్వాడ జగన్నాధం (2017),అలా వైకుంఠపురములో (2020),పుష్ప(2021) ల తో ఈ ఫీట్ సాధించారు.

ప్రభాస్ (4):రాజమౌళి ,ప్రభాస్ కలయిక లో వచ్చిన ఆల్ టైం ఇండియన్ హిట్ అయినా బాహుబలి తో తన మొదటి 1 మిలియన్ మార్క్ ని అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత బాహుబలి: ది బిగినింగ్ (2015) ,బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017) , సాహో (2019) ,రాధే శ్యామ్ (2022 ) ల తో ఈ ఫీట్ ని అందుకున్నారు, అయితే ఇక రానున్న ప్రభాస్ సినిమా ల అన్ని కూడా పాన్ ఇండియన్ హై బడ్జెట్ చిత్రాలు కావడం తో అన్ని సినిమా ల కూడా ఈ ఫీట్ ని రీచ్ అవుతాయి.

రామ్ చరణ్(3):సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన స్టైలిష్ యాక్షన్ మూవీ ధ్రువ (2016 ) తో తన మొదటి 1 మిలియన్ మార్క్ ని అందుకున్న రామ్ చరణ్ ,తర్వాత 2018 లో రిలీజ్ అయినా రంగస్థలం,2022 లో రిలీజ్ అయినా ఆర్ ఆర్ ఆర్ తో ఈ ఫీట్ ని అందుకున్నారు.

పైన చెప్పిన వారు కాకుండా మెగాస్టార్ చిరంజీవి(4 ),వరుణ్ తేజ్ (4 ),
విజయ్ దేవరకొండ(3 ),బాలకృష్ణ(3 ),వెంకటేష్(3 ),నాగార్జున (2 ),నాగ చైతన్య(2),అడవి శేష్(2 ),నిఖిల్(1),నితిన్(1) ,నవీన్ పోలిశెట్టి(1),అఖిల్(1) ఉన్నారు.

431 views