TOLLYWOOD:ఒక్క హిట్ కూడా లేకుండా వరుసగా సినిమా లు చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ?

Posted by venditeravaartha, April 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

కొంత మంది హీరోయిన్ లు అందం గా ఉన్నపటికీ వారికీ అవకాశాలు రావు ,ఇంకొంత మంది టాలెంట్ ఉన్నపటికీ అవకాశాలు రావు ,ఈ రెండు లేకుండా ఉన్న వారికీ అవకాశాలు వచ్చాయి అంటే వారికీ అదృష్టం ఉన్నట్లు లెక్క ,ఆ కోవా కి చెందిన వారే ‘మేఘ ఆకాష్’,మేఘా ఆకాష్ పేరు పరిచయం అక్కర్లేదు. ఈ భామ ఇప్పటివరకు 7 తెలుగు సినిమాల్లో నటించింది. అందులో కేవలం ఒకే ఒక్క చిత్రం మాత్రమే కాస్త ఆడింది. మిగతావన్నీ ఢమాల్.

ఒక్క హిట్ లేకుండా ఇన్ని సినిమాలు చేసిన హీరోయిన్ బహుశా మేఘా తప్ప ఇంకోరు ఉండరేమో. ‘లై’, ‘ఛల్ మోహన్ రంగా’ సినిమాలతో తెలుగులో మొదట హల్చల్ చేసిన ఈ భామ ఆ తర్వాత ‘రాజ రాజ చోర’, ‘డియర్ మేఘ’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘రావణసుర’ సినిమాల్లో నటించింది. రవితేజ హీరోగా నటించిన ‘రావణాసుర’తో సహా అన్ని ఫ్లాపులే.

‘రాజ రాజ చోర’ కి మంచి పేరు వచ్చిన ఆ పేరు అంత హీరో ‘శ్రీ విష్ణు’ కి వచ్చింది,సక్సెస్ పరంగా చెప్పుకోవాలంటే అదొక్కటే. మిగతావన్నీ అంతే సంగతులు. పెద్ద అందెగత్తె కాదు. గొప్ప నటి కాదు. అయినా ఆమెకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.త్వరలో ‘మనుచరిత్ర’, ఇంకో సినిమా విడుదల కానున్నాయి. ఈ సినిమాలైనా ఆమెకి విజయం తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.

Tags :
1930 views