Baby: బేబీ మూవీ కథ నా రియల్ స్టోరీ అంటూ షాక్ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్!

Posted by venditeravaartha, July 12, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అప్పట్లో సినిమా ల లో ఛాన్స్ ల కోసం సంవత్సరాల తరబడి సినిమా ఆఫీస్ ల వెంట తిరుగుతూ ఉండే వాళ్ళు కానీ ఇప్పటి తరం లో సోషల్ మీడియా ని ఉపయోగించుకుని అతి కొద్దీ సమయం లోనే షార్ట్ ఫిలిమ్స్ ,వెబ్ సిరీస్ ల ద్వారా సినిమా ల లోకి వచ్చేస్తున్నారు. అలాంటి కోవా లోకి వస్తారు డైరెక్టర్ ,రచయిత అయినా సాయి రాజేష్.సోషల్ మీడియా లో షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయినా అతను కమెడియన్ సంపూర్ణేష్ బాబు తో హృదయకాలేయం మూవీ తో నిర్మాత గా మారాడు,ఆ తర్వాత తానే కథ ఇచ్చి ప్రొడ్యూసర్ గా కమెడియన్ సుహాస్ తో చేసిన కలర్ ఫోటో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో నేషనల్ అవార్డు ని కూడా గెలుపొందిన విషయం తెలిసిందే.

COLOR PHOTO

సాయి రాజేష్ డైరెక్షన్ లో ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య,విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల లో బేబీ అనే మూవీ మూవీ త్వరలోనే జులై 14 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ఇటీవలే రిలీజ్ అయినా సినిమా ట్రైలర్ అందరిని అలరించింది అనే చెప్పాలి
ఇక ఈ సినిమా కి సంబంధిచి ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది.ఈ మూవీ కథ తన నిజ జీవితం లో జరిగిన స్టోరీ అని చిత్ర దర్శకుడు సాయి రాజేష్ చెప్పడం అందరికి ఇంకొంచెం క్యూరియాసిటీ ని పెంచింది.

BABY movie

మారుమూల ప్రాంతం లో ఉంటున్న బేబీ అక్కడ తన ఫ్రెండ్ ఆనంద్ దేవరకొండ తో ప్రేమ
లో ఎలా ఉంది తాను అక్కడ నుంచి సిటీ వెళ్ళాక తన లో ఎలాంటి మార్పులు వచ్చాయి తన మొదటి ప్రేమ అలానే ఉందా లేక మధ్యలో వచ్చిన కొందరి వలన మారిపోయిందా అనేది ప్రధానంగా బేబీ కథ అని డైరెక్టర్ సాయి రాజేష్ తెలియచేసాడు.తాను చదువుకున్న రోజుల్లో
ఒక అమ్మాయి ని ఎంతగానో ప్రేమించాను అని అయితే తాను వేరే ఉరికి వెళ్ళాక తనని దూరం పెట్టింది అనుకుని తన మీద అనుమానం తో ఆ అమ్మాయి ని దూరం చేసుకున్న అని చెప్పి ఆ తర్వాత ఆ అమ్మాయి తన మీద నే ప్రేమ ని ఉంచుకుని అక్కడ పరిస్థితుల కారణం చేత కొన్ని రోజులు దూరం పెట్టింది అని తెలుసుకుని ఇప్పటికే బాధ పడుతున్నాను అని అన్నారు.

3054 views