SALAAR: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి వార్త చెప్పిన ‘సలార్’ టీం..

Posted by venditeravaartha, July 9, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా ప్రభాస్ మార్కెట్ హైక్ లో ఉండడంతో ఆయనతో భారీ బడ్జెట్ చిత్రాలు చేయడానికి బడా నిర్మాతలు ముందుకు వస్తున్నారు.ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వీటిన్నింటికంటే ముందుగా ‘సలార్’ థియేటర్లోకి రానుంది. ఇటీవల టీజర్ రిలీజ్ ఆకట్టుకుంది. అయితే ఇందులో ఎక్కువగా ప్రభాస్ ను చూపించలేదని ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. దీంతో టీజర్ పేలలేదు. ఈ విషయం తెలుసుకున్న సినీ బృందం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మరికొద్దిరోజుల్లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

prasanth neel

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న ‘సలార్’ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులవుతోంది. ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. బొగ్గు గని నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో ప్రభాస్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లోకంటే ఇందులో భారీ యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

salaar poster

అయితే అంతకంటే ముందే అంటే వచ్చే నెలలో ట్రైలర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశతో ఉన్నారు. కానీ ట్రైరల్ మాత్రం ఫ్యాన్స్ లో జోష్ పెంచే విధంగా ఉంటుందని అంటున్నారు. ప్రత్యేకంగా ఫ్యాన్స్ పండుగ చేసుకునే టీజర్ కట్ చేశారని అంటున్నారు. ఇటీవల సినీ బృందం ఆ విషయాన్ని బయటపెట్టింది. ఆగస్టు నెలలోనే ట్రైలర్ రిలీజ్ ఉంటుందని తెలిపారు.

prabhas salaar

బాహుబలి తరువాత ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ మళ్లీ తగలలేదు. ఆ మూవీ తరువాత సాహో, రాధేశ్యామ్ నిరాశపరిచాయి. అయితే సలార్ పై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. అటు ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు రెండే రెండు సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. ఈసారి ప్రభాస్ కు కచ్చితంగా హిట్టు ఇస్తారని అంటున్నారు. అయితే సెప్టెంబర్ లో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలి.

1653 views