సినీ ఫీల్డ్ కు చాలా మంది హీరో అవుదామని వస్తారు. కానీ కొంత మందికి సొంతంగా సినిమా తీయాలనే తపన ఉంటుంది. తమిళ డైరెక్టర్ ఎస్ జె సూర్య గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఎందుకంటే పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘ఖుషి’సినిమాను అందించి అందరిచేత ప్రశంసలు తెప్పించుకుున్నాడు. ఆ తరువాత తెలుగులో, తమిళంలో విబిన్న చిత్రాలు తీసి ప్రత్యేకంగా నిలిచారు. అయితే కొంతకాలం తరువాత ఎస్ జె సూర్య డైరెక్టర్ వృత్తి మానినటుడిగా మారాడు. మహేష్ బాబు నటించిన ‘స్సైడర్’ చిత్రంలో ఆయన నటనకు చాలా మంది ఫిదా అయ్యారు. ఇక తాజాగా ఆయన ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈమూవీ గురించి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే?
రాధా మోహన్ డైరెక్షన్లో ‘బొమ్మై’ అనే సినిమా రెడీ అయింది. దీనిని జూలై 16న థియేటర్లోకి తీసుకువస్తున్నారు. ఇందులో ఎస్ జె సూర్యతో పాటు ప్రియ భవాని శంకర్ లు కలిసి నటించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఇవి యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగానే ఎస్ జె సూర్య నటనలో లీనమైపోతాడు. తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయాలని చూస్తాడు. ఇక ఈ సినిమాలో ఉండే ముద్దు సీన్లలో ఎస్ జె సూర్య రెచ్చిపోయాడు.
ట్రైలర్లలో హీరో, హీరోయిన్ల మధ్య ముద్దుసీన్లు విపరీతంగా కనిపిస్తాయి. దీంతో ఇది విపరీతంగా పాపులర్ అవుతోంది. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఉండే కొన్ని సీన్లను స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈరోజుల్లో సినిమా నార్మల్ గా ఉంటే ఎవరూ చూడరనేది కొందరి అభిప్రాయం అందుకే కొందరు డైరెక్లర్లు ముద్దు సీన్లను కామన్ చేశారు. అయితే బొమ్మై సినిమాలో మాత్రం రెచ్చిపోయే విధంగా సీన్లు ఉండడంతో యూత్ బాగా ఇంప్రెస్ అవుతున్నారు.
రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఇందులో ప్రియా భవానీ శంకర్ తో పాటు మరో హీరోయిన్ తమిళరసన్ నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచే ఇంప్రెస్ పెరిగింది. అప్పటి నుంచే ముద్దు సీన్లను చూపిస్తూ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ట్రైలర్ లోనూ అదే ఉండడంతో సినిమాపై హోప్స్ పెరుగుతున్నాయి. ట్రైలర్ లోనే ఇంత రచ్చ చేస్తున్న బొమ్మై థియేటర్లోకి వచ్చాక ఎంత హడావుడి చేస్తోందనని చర్చించుకుంటున్నారు.