Surekha Vani: కేపీ చౌదరితో పలువురు సినీ సెలబ్రెటీల చాటింగ్.. వెలుగులోకి సురేఖ వాణి పేరు..

Posted by venditeravaartha, June 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు వీడేట్టు లేదు. గతంలో పలువురు సినీ సెలబ్రెటీస్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కొంతకాలం ఆ విషయం కనుమరుగైంది. తాగాజా ప్రముఖ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో ఒక్కో విషయం వెలుగులోకి వస్తుంది. ఆయన సెల్ డేటాను పరిశీలించిన తరువాత చాలా మంది తెలుగు సినీ సెలబ్రెటీలు ఆయనతో సంబందం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరంతా డ్రగ్స్ తీసుకున్నారా? లేక సాధారణ సంబంధలేనా? అనేది తేలాల్సి ఉంది. అయితే లేటేస్టుగా కేపీ చౌదరితో సహాయ నటి సురేఖ వాణి, ఆమె కూతురు కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. దీంతో సురేఖ వాణిని విచారించనున్నారా? అనే చర్చ సాగుతోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్ర నిర్మాత కెపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. కోర్టు పర్మిషన్ తో రెండు రోజుల పాటు పోలీసుల కస్టడిలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చౌదరిని లోతుగా పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు కనిపించాయి. అతనితో పలువురు సినీ సెలబ్రెటీలు చాటింగ్ చేసినట్లు తెలుస్తోది. అయితే వారందరికీ డ్రగ్స్ విక్రయించాడా? లేదా? అనేది పోలీసులు తెలుసుకోనున్నారు. కేపీ చౌదరి తో సంబంధాలున్నట్లు బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరు వినిపిస్తోంది. కేపీ చౌదరి కి అషురెడ్డి వందల సార్లు కాల్స్ చేసినట్లు పోలీసలు డేటా సేకరించారు. అయితే ఈ విషయంపై అషురెడ్డి స్పందించారు. అదంతా ఫేక్ వార్తలు అని కొట్టిపారేశారు.

తాజాగా కేపీ చౌదరితో సురేఖ వాణి, అతని కూతురు సుప్రీతలు దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. కేపీ చౌదరితో వీరికి ఉన్న సంబంధమేంటి? అని కొందరు ఫొటోలతో హల్ చల్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై సురేఖ వాణి ఏ విధంగా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలోనూ టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు కుదిపేసింది. ఇప్పుడు కేపీ చౌదరితో మరెన్ని పేర్లు బయటకు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. అయితే పోలీసులు కేపీ చౌదరితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తే మాత్రం టాలీవుడ్ లో మరికొన్ని రోజుల పాటు ఆందోళన వాతావరణంలో కొనసాగనుంది. అయితే కేపీ చౌదరి సినీ నిర్మాత అయినందున ఆయనతో సాధారణంగా చాలా మంది ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. అయితే ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Tags :
4075 views