ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) గారి క్రేజ్ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు. తన అభిరుచి, ఎనర్జీ లెవల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అనారోగ్యం నుంచి కోలుకున్న రజనీ ఫిట్‌గా ఉండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. యంగ్ హీరోలు కూడా ఆయనలా సినిమాలు పూర్తి చేయలేకపోతున్నారు. అతను ఈ వయస్సులో కూడా యువ హీరో ల కి గట్టి పోటీని సెట్ చేయడం సూపర్ స్టార్ మాత్రమే చేయగలడు.
ప్రస్తుతం నెల్సన్(Nelson) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న జైలర్(Jailer) చిత్రాన్ని రజనీకాంత్ పూర్తి చేసే పని లో ఉన్నారు. ఈ సినిమాలో జైలర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వివిధ ఇండస్ట్రీ ల నుంచి మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, అర్జున్, తమన్నా, సునీల్ వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఆగస్ట్ 10న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జైలర్ మూవీ తర్వాత తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం లో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న లాల్ సలామ్(Lal salam) మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.. యూత్ అల్లర్లు, క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ముంబైకి చెందిన మొయిదీన్ భాయ్ అనే గ్యాంగ్‌స్టర్‌గా రజనీకాంత్ ప్రత్యేక పాత్ర లో రజినీకాంత్ కనిపించనున్నారు . ఈ సినిమా కూడా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
సూపర్ స్టార్ తన 170వ చిత్రాన్ని సూపర్ హిట్ మూవీ జై భీం ఫేమ్ టిజి జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కూడా బూటకపు ఎన్‌కౌంటర్స్‌తో వ్యవహరిస్తుంది మరియు ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. జూలైలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందని సమాచారం. తలైవర్ లోకేశ్ కనగరాజ్‌తో తన 171వ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేయనున్నారు. ఇలా వరుస సినిమా ల తో బిజీ గా ఉన్న సూపర్ స్టార్ ఈ సినిమా లు అన్ని త్వరలో పూర్తి చేసి సినిమా ల నుంచి తప్పుకోనున్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి.