SHRIYA:చిరంజీవి తో స్పెషల్ సాంగ్ కోసం కోట్లు డిమాండ్ చేస్తున్న శ్రియ

Posted by venditeravaartha, April 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినిమా ల లో హీరోయిన్ ల లైఫ్ టైం మహా అంటే ఒక 10 సంవత్సరాలు ఉంటుంది ,ఆ తర్వాత వారు ఏదైనా సిస్టర్ ,ఆంటీ ,పిన్నీ ,విల్లన్ క్యారక్టర్ ల లో కనిపిస్తారు,కొంత మంది అయితే పెళ్లి చేసుకుని ,టీవీ సీరియల్స్ ల లో నటిస్తారు.కానీ మరి కొంత మంది హీరోయిన్ లు మాత్రం సైడ్ క్యారక్టర్ లు ,ఐటెం సాంగ్స్ లు చేస్తున్నారు.వయసు పెరుగుతున్న వారి అందాల తో ప్రేక్షకుల ను మెప్పిస్తున్నారు,ఆ జాబితా లోకి వస్తారు ‘శ్రియ శరన్’.

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా,తనవరకు వచ్చిన ప్రతి సినిమా ఒకే చేస్తున్నారు హీరోయిన్ శ్రియ . ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించారు. అయితే హీరోయిన్‏గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్పెషల్ సాంగ్ చేసి అదుర్స్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. దేవదాసు, తులసి వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటకు స్టెప్పులేశారు. ఇక ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్‏తో అలరించేందుకు సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తుంది.

ఈ సాంగ్ కోసం శ్రియ భారీగానే డిమాండ్ చేస్తోందట. దాదాపు కోటి రూపాయాలు నిర్మాణ సంస్థను డిమాండ్ చేసిందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది. పైసా వసూల్ తర్వాత ఆమెకు సరైన విజయం లేదు. ట్రిపుల్ ఆర్ పెద్ద హిట్ అయినా,అందులో ఆమె చేసింది చిన్న పాత్రే. ఇక ఇటీవల కబ్జా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే భోళా శంకర్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిందని,అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి 40 సంవత్సరాల వయసు లో కూడా ఇలా ఐటెం సాంగ్స్ ల తో అలరిస్తున్నారు శ్రియ.

672 views