RRR:ఆస్కార్ అవార్డు కోసం ఖర్చు చేసింది కేవలం 8 .5 కోట్లు మాత్రమే

Posted by venditeravaartha, March 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మొట్ట మొదటి సారి గా ఒక ఇండియన్ సినిమా కి ఆస్కార్ ని తెచ్చి పెట్టిన RRR సినిమా రిలీజ్ అయ్యి 25th మార్చ్ 2023 తో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది,అయితే ఒకరు మంచిగా ఎదుగుతున్న ,లేక మంచి స్థాయి కి వెళ్తున్న ఓర్చుకోలేని సమాజం లో ఉన్నాం మనం,దానికి ఏ మాత్రం కూడా తక్కువ లేకపోలేదు RRR కూడా ,మన తెలుగు సినిమా ఈ స్థాయి లో పేరు ,ప్రతిష్టలు తీసుకుని వచ్చిన కొంత మంది దాని మీద ఏడ్చేవాళ్ళని కూడా చూసాం. సినిమా అంత పెద్ద హిట్ అయ్యి ,ఇండస్ట్రీ రికార్డు లు బద్దలు కొట్టి ,దాదాపు గా 70 పైన ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుని ,గోల్డెన్ గ్లోబ్ ,ఆస్కార్ అవార్డు ల ను సొంతం చేసుకున్న తరుణం లో కొంత మంది ‘అవార్డు ‘ ల కోసం RRR టీం 80 ,50 కోట్ల పైన ఖర్చు చేసారు అని అన్నారు.

అయితే ఈ విషయం పైన ఆ సినిమా నిర్మాత అయినా డి వి వి దానయ్య గారు మాట్లాడుతూ అవార్డు ల కోసం 80 కోట్లు ,50 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని ఏమి ఉంది ,సినిమా అంత పెద్ద హిట్ అయినా కూడా ఆ స్థాయి లో ప్రాఫిట్ ఉండదు మరి అవార్డు ల కోసం ఎవరు అంత ఖర్చు పెట్టారు ,కేవలం సినిమా మీద అక్కసు తోనే ఇలా కొంత మంది అంటున్నారు అన్నారు,ఇదే విషయం గురించి రాజమౌళి కొడుకు ,RRR సినిమా లైన్ ప్రొడ్యూసర్ అయినా ‘కార్తికేయ ‘ ఈ విధముగా స్పందించారు.

ఆస్కార్‌ అవార్డ్‌ సాధించడం కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ రూ 80 కోట్లు ఖర్చు పెట్టిందని విమర్శలు రావడం, దానిపై మాటల యుద్ధం జరగడం తెలిసిందే. అయితే అది నిజం కాదనీ, కేవలం రూ 8.5 కోట్లు ప్రమోషన్స్‌ కోసం ఖర్చు పెట్టామని . కార్తికేయ క్లారిటీ ఇచ్చారు. ‘‘ఆస్కార్‌ కోసం మేం ప్రచారం ప్రారంభించినప్పుడు ఆస్కార్‌ టీమ్‌ను కొనేశారనీ, ఆస్కార్‌ టికెట్స్‌ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారనీ వార్తలు వచ్చాయి.

మొత్తం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారని అన్నవారు కూడా ఉన్నారు. డబ్బులు ఇస్తే ఆస్కార్‌ అవార్డ్‌ వస్తుందని అనుకోవడం పెద్ద జోక్‌. అయితే ఈ క్యాంపైన్‌ కోసం మేం మొదట అనుకున్న బడ్జెట్‌ రూ. 5 కోట్లు. నామినేషన్స్‌ వచ్చిన తర్వాత మరికొంత బడ్జెట్‌ పెంచాం. చివరకు రూ. 8.5 కోట్లు అయింది. చంద్రబోస్ ,కీరవాణి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రేమ్‌రక్షిత్‌, రాహుల్‌ సిప్తిగంజ్‌, కాలబైరవలను ఆస్కార్‌ కమిటీ ఆహ్వానించింది. మిగిలిన మా కుటుంబ సభ్యులు రూ.1500 డాలర్లకు టికెట్లు కొని హాజరయ్యారు’ అని చెప్పారు కార్తికేయ.

507 views