PRABHAS:ఆదిపురుష్ ట్రైలర్ ఎలా ఉందంటే ! ఈ సారి 2000 కోట్లు పక్కా!.

Posted by venditeravaartha, May 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బాహుబలి సిరీస్ తో తెలుగు రాష్ట్రాల తో సమానంగా ఇంకా చెప్పాలి అంటే అంతకు మించిన స్టార్ డాం ని హిందీ లో సంపాదించుకున్నారు ‘రెబెల్ స్టార్ ప్రభాస్’,బాహుబలి తర్వాత అయినా తీసిన సాహో తెలుగు లో ఆశించిన స్థాయి లో ఆడలేదు కానీ బాలీవుడ్ లో హిట్ అయింది ,భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా ‘రాధే శ్యామ్’ తీవ్ర స్థాయి లో నిరాశపరించింది.ఇక ప్రభాస్ స్టామినా తగ్గిపోతుంది అనుకున్న సమయం లో బాలీవుడ్ డైరెక్టర్ ‘ఓం రౌత్’ తో భారీ బడ్జెట్ తో ప్రారంచారు ‘ఆదిపురుష్’ సినిమా.అయితే ఇది వరకే రిలీజ్ అయినా టీజర్ మీద భారీ స్థాయి లో నెగటివ్ కామెంట్ ల ను అందుకున్నారు టీం అంతా,గ్రాఫిక్స్ సరిగా లేదు అని,ప్రభాస్ అసలు రాముడు గెట్ అప్ లో సరిగా చూపించలేదు అని మండిపడ్డారు.

ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ని టీజర్ ఇచ్చిన నెగటివ్ పబ్లిసిటీ తో సినిమా లోని గ్రాఫిక్స్ ,ఎడిటింగ్ ల ను మార్చి మరల కొత్తగా మే 9 నా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.ముందు రోజు సినిమా టీం అంతా కలిసి హైదరాబాద్ లో ని AMB సినిమాస్ లో ఆదిపురుష్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.ఆ ట్రైలర్ చూసాక సినిమా ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది అంటున్నారు ఫ్యాన్స్.

ఆదిపురుష్ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 22 సెకన్లు. సీత(క్రితిసనాన్) కిడ్నాప్ సీన్‌తో మొదలయ్యే న ట్రైలర్ ఆ తర్వాత రావణుడితో ఆఖరి పోరు వరకు జరిగే సంఘటనల పరంపర. ట్రైలర్ లో ఉన్న కంటెంట్ కంటే VFX బాగుంది.మరి వరుస సినిమా ల తో బిజీ ఉన్న ప్రభాస్ కి ఈ సినిమా అయినా హిట్ ఇచ్చి మరల హిట్ ట్రాక్ పడాలని కోరుకుందాం.

629 views