Janasena: 9 రోజుల్లో తప్పిపోయిన అమ్మాయిని వెనక్కి రప్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!

Posted by venditeravaartha, July 2, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Pawan Kalyan : జనం కోసం స్వచ్ఛంగా పని చేసే రాజకీయ నాయకులూ కేవలం సినిమాల్లో మాత్రమే కనిపిస్తారు అని అంటూ ఉంటారు. ప్రజలకు ఏమి చేస్తే మంచిది?, ఎలా చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అని ఆలోచించకుండా, ఏమి చేస్తే మా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది?, ఎలాంటి ఎత్తులు వేస్తే కోట్లాది రూపాయిల డబ్బులు వస్తాయి అనే అంశాల మీదనే ఎక్కువగా రాజకీయ నాయకులూ పని చెయ్యడం ఇన్ని రోజులు మనం చూసాము. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం డ్యూటీ ఎక్కిన రోజు నుండి కేవలం జనాల మంచి కోసమే పని చేస్తున్నాడు. అధికారం వచ్చిన వెంటనే జనాలకు అందుబాటులో లేని సీఎం ని గత ఐదేళ్లుగా చూసాము.

కానీ గెలిచినా తర్వాత జనాల్లో తిరుగుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ క్షణాల్లో పరీక్షించే నాయకత్వ లక్షణాలను కేవలం పవన్ కళ్యాణ్ లో మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఉదాహరణకి మొదటి అసెంబ్లీ సమావేశాలకు హాజరై తిరిగి తన క్యాంప్ ఆఫీస్ కి వెళ్తున్న సమయం లో తన కోసం ఎదురు చూస్తున్న జనాలను చూసి తన కాన్వాయ్ ని ఆపి, వారి సమస్యలను ఓపిగ్గా వింటూ తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్. వారిలో భీమవరం కి చెందిన శివ కుమారి అనే మహిళా తన కూతురు 9 నెలలుగా కనిపించడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు సరిగా పట్టించుకోలేదని, మీరే ఎలా అయినా మాకు న్యాయం చెయ్యాలని, తన బిడ్డని వెనక్కి తిరిగి తీసుకొని రావాలని పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని ఏడ్చింది. ఆమె వ్యధని మనసుతో విన్న పవన్ కళ్యాణ్ వెంటనే విజయవాడ సర్కులర్ ఇన్స్ పెక్టర్ తో ఫోన్లో మాట్లాడి, తన వాహనం లో ఆమెని పోలీస్ స్టేషన్ కి పంపి సీఐ తో మాట్లాడించాడు.

ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఐ వెంటనే ఒక ప్రత్యేక బృందం ని ఏర్పాటు చేసి, తప్పిపోయిన ఆ అమ్మాయి ఆచూకీ ని వెతికే ప్రయత్నం చేసారు. నేడు ఆ అమ్మాయి జమ్మూ ప్రాంతం లో తన ప్రియుడితో కలిసి ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించి, ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ఆంధ్ర ప్రదేశ్ కి తీసుకొస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ఇంతటి మంచి కార్యం తలపెట్టడం ని చూసి అభిమానులు ఆయనని ప్రశంసలతో ముంచి ఎత్తుతున్నారు. ఇన్ని రోజులు కేవలం స్వార్థం కోసం పని చేసే రాజకీయ నాయకులను మాత్రమే చూశామని, కానీ మొట్టమొదటిసారిగా ప్రజల కోసం పని చేసే నాయకుడిని చూస్తున్నాం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పోస్టులు వేస్తున్నారు. రాబొయ్యే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇంకా ఇలాంటి ఎన్ని మహోన్నత కార్యక్రమాలను తలపెడుతారో చూడాలి.

232 views