Pawan Kalyan: పొత్తులపై కీలకమైన వ్యాఖ్యలు చేసిన పవన్‌కల్యాణ్..టీడీపి తో పొత్తు కన్ఫర్మ్ అయినట్టేనా….?

Posted by venditeravaartha, May 12, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఎప్పుడు ఎలా సమీకరణాలు మారుతాయో ఎవరికి తెలియదు నిన్న తిట్టుకున్న వారే నేడు దోస్తులుగా మన ముందు తిరుగుతారు రాజకీయాల్లో ఇది మామూలునే అయితే ఇది అంతా దేనికి చెప్తున్న అని అనుకుంటున్నారా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా జనసేన పార్టీ పని చేస్తుంది అని పొత్తులు తప్పకుండా ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మొన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డా తో ఢిల్లీ (Delhi) లో ఇదే అంశంపై చర్చలు జరిగాయని జనసేన పార్టీ ముందు కన్నా ఇప్పుడు మరింతగా పుంజుకుంది అని మాకు బలం ఉన్నచోట మా అభ్యర్థులను పోటీలో దింపుతామని ఆయన చెప్పారు. ఒక కులం కోసం పార్టీ పోరాడదని నాకు సీఎం అవ్వాలనే ఆశ లేదు అని ప్రజలకు మంచి చేయాలన్నదే నా అంతిమ లక్ష్యం అని ఆయన చెప్పారు.

ప్రజల కోసం నేను రాజకీయాలలోకి వచ్చానని నా మీద విమర్శలు వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం గా ఉన్నాను అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మన కష్టం మన బలం చూసి పదవులు రావాలని అంతే కాని ఎవరో ఏదో ఇస్తారని ఆశ పడటం నాకు ఇష్టం ఉండదు అని అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాడిని కాదు అని చెప్పారు. ముందస్తుగా ఎన్నికలు వస్తే జూన్ నుంచి జనసేన పార్టీ ని మరింత ముందుకు తీసుకు వెళతానని చెప్పారు సీఎం పదవి కోసం వెంపర్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు అని గృతు చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ కి ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆయన చెప్పారు. జనసేన పార్టీ మీద నా మీద బురద జల్లే వాళ్ళకి నా అభిమానులు ఒక్కటే చెప్పండి నేను ఎవరికోసం పని చేయటం లేదు ప్రజల కోసం పని చేస్తున్నాను అని చెప్పాలని తెలిపారు.

ఇక రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపాలని దానికి సమిష్టి కృషి అవసరం అని ఎన్నికలు ప్రభావితం చేసే అన్ని పార్టీలు కచ్చితంగా కలవాలని ఆయన చెప్పారు టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీచేసే అవకాశం ఉందని దీనిపైనే ఇరు పార్టీ అధినేతలతో చర్చలు జరిపానని చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన 137 స్థానాల్లో పోటీ చేసిందని కనీసం 40 స్థానాల్లో మేము గెలిచి ఉంటే ఈరోజు మీరు అన్నట్టు అడిగే పరిస్థితి వచ్చును అని అందుకె రానున్న ఎన్నికల్లో మా బలం ఉన్న చోట పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలబడే అవకాశం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇక వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల చేస్తున్న నిర్లక్ష్యం హేయమైన చర్య అని చెప్పారు. రైతులను (Farmers) జగన్ క్రిమినల్స్‌లా చూస్తున్నారు అని పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ధ్వజమెత్తారు.

538 views