PAWAN KALYAN:పవన్ కళ్యాణ్ ,ఎం ఎస్ ధోని కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియన్ మూవీ ? డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా.

Posted by venditeravaartha, April 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళా పవన్ కళ్యాణ్ కమిట్ అయినా సినిమా ల ను త్వరగా పూర్తి చేసే పని లో ఉన్నారు, 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత రిలీజ్ చేసిన ‘వకీల్ సాబ్’ తో తన స్టామినా చూపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమా లు చేస్తున్నారు, అయితే డైరెక్టర్ లు క్రిష్,సుజిత్ లు తీస్తున్న సినిమా లు పాన్ ఇండియన్ హై బడ్జెట్ సినిమా లు , ఒకటి పీరియాడికల్ డ్రామా కాగా ,మరొకటి గ్యాంగ్ స్టార్ సినిమా ,వీటితో పాటు గా సముద్రఖని డైరెక్టర్ గా తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతాం ‘ ను రీమేక్ చేస్తున్నారు.హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో భారీ మల్టీ స్టారర్ సినిమా తీస్తునట్లు ప్రచారం జరుగుతుంది,ఈ భారీ సినిమా ను రౌడీ డైరెక్టర్ ‘సందీప్ రెడ్డి వంగా’ డైరెక్ట్ చేయనున్నారు, దేశ భక్తి ,రక్షణ ,డ్రగ్స్ వంటి వాటిని ప్రాధాన్యం గా తీసుకుని ఈ సినిమా తీయనునట్లు ప్రచారం,
ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు నటించనున్నది ఎవరో కాదు ‘మిస్టర్ కూల్’,’తైలవ’,’కెప్టెన్ కూల్ ‘ గా పిలవబడే ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్ ‘ఎం ఎస్ ధోని’.2019 వరల్డ్ కప్ తర్వాత ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరమైన ఐపీల్ ఆడుతూ వచ్చారు ,కానీ 2023 ఐపీల్ తర్వాత క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పనున్నారు,తర్వాత ఆర్మీ లో తనకి ఇచ్చిన అరుదైన ‘Lieutenant Colonel ‘ గా ఉంటూ ,కొన్ని సినిమా ల లో నటించాలి అనుకుంటున్నారు.

అయితే మొదటగా తమిళ సూపర్ స్టార్ విజయ్ తో కలిసి ఒక సినిమా చేయాలి అనుకున్నారు విజయ్ ,ఈ సినిమా ని యంగ్ సెన్సేషన్ ‘లోకేష్ కానగరాజ్’ డైరెక్ట్ చేస్తున్నారు అనే వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తో నటిస్తున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఒక పక్క వరుస సినిమా ల తో బిజీ గా ,మరో పక్క జనసేన పార్టీ ఎన్నికలకి సిద్దమవుతున్న వేళా ఈ సినిమా ఇప్పట్లో స్టార్ట్ అయ్యేటట్లు లేదు. పవన్ కళ్యాణ్ ,ధోని ఇద్దరు కూడా దేశ భక్తి కలిగిన వారు,అపజయాలకు క్రుంగి పోయేవారు కాదు,మరి వీరి కలయిక లో సినిమా అంటే అది ఏ స్థాయి లో ఉంటుందో అర్ధం చేసుకోవాలి,ఇది కేవలం ప్రచారం అయినప్పటికీ ఇది జరిగితే బాక్స్ ఆఫీస్ బద్దలు అవడం ఖాయం.

314 views