పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు ,రాజకీయాల లో బిజీ బిజీ గా ఉన్నారు, బుధవారం నుంచే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ స్టార్ట్ అయింది . కానీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ‘హరి హర వీరమల్లు’ గురించి చాలా రోజులుగా ఎటువంటి అప్‌డేట్ లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎదుర్కొంటున్న కష్టాల గురించి నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది.
క్రిష్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘హరి హర వీరమల్లు’ . పవన్‌తో గతంలో ‘ఖుషి, బంగారం’ సినిమాలు నిర్మించిన ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే కొంతకాలం పాలిటిక్స్‌లో చాలా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ ద్వారా సినిమాలకు రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే వరుస చిత్రాలకు సైన్ చేసిన ఆయన.. ఏఎం రత్నంతో ఓ ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యాడు. అలా క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా ‘హరి హర వీర మల్లు’ సినిమా తెరపైకి వచ్చింది. నిజానికి ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయినప్పటికీ పవన్ ఈ మూవీ కంప్లీట్ చేయకుండా ‘వినోదయ సీతాం ’తో పాటు ‘ఉస్తా్ద్ భగత్‌సింగ్’పై కాన్సంట్రేట్ చేశాడు. మరి దీని వెనకున్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ మూవీకి సంబంధించి పోస్టర్లు, మేకింగ్ వీడియో విడుదలయ్యాయి. కానీ ఆ తర్వాతి నుంచి ఎటువంటి అప్‌డేట్ లేదు. కాగా,HHVM ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిందని, ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిచిపోయిందనే రూమర్స్ నెట్టింట షికారు చేస్తున్నాయి. అయితే ఎలాగైనా ఈ మూవీని కంప్లీట్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. ఈ గ్యాప్‌లోనే పవన్ ‘వినోదయ సీతాం’ రీమేక్‌తో పాటు ‘OG, ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తిచేసే పనిలో పడ్డారని తెలుస్తోంది.కానీ వాస్తవం ఏంటి అనేది త్వరలోనే తెలియనున్నది.