NTR: ఎన్టీఆర్ మిస్ చేసుకున్న సినిమాలు ఇవేనా..చేసి ఉంటే అప్పట్లో పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడు!

Posted by venditeravaartha, May 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) 18 సంవత్సరాల వయసులోనే హీరో గా ఎంట్రీ ఇచ్చిన తారక్ తన మొదటి సినిమా నిన్ను చూడాలని(2001) తో పరిచయం అయినా ఆ తరువాత రాజమౌళి గారి డెబ్యూ మూవీ అయినా స్టూడెంట్ నెంబర్ వన్(Student number 1) తో సూపర్ హిట్ సాధించాడు.ఆ వెంటనే ఆది ,సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తో చిన్న వయసులోనే స్టార్ హీరో గా ఎదిగారు.మెగాస్టార్ చిరంజీవి గారికి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి అంటే ఆయన ఏ స్థాయి లో ఇంపాక్ట్ చూపించారో అర్ధం అవుతుంది.తన 22 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల లో నటించిన ఎన్టీఆర్ మరి కొన్ని బ్లాక్ బస్టర్ సినిమా ల లో నటించాలసింది కానీ కొన్ని కారణాల వలన ఆయన ఆ సినిమా ల ని చేయలేదు..ఒకవేళ ఆ సినిమా లను జూనియర్ ఎన్టీఆర్ కానీ చేసి ఉంటె అప్పట్లో పాన్ ఇండియన్ సూపర్ స్టార్ రేంజ్ ని అందుకునే వారు.

వి వి వినాయక్ గారి దిల్(2003) సినిమా ని మొదట జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పారు కానీ అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ లో స్టూడెంట్ కథ చేసిన ఎన్టీఆర్ దిల్ సినిమా ని రిజెక్ట్ చేసారు..ఆ తర్వాత వినాయక్ గారితోనే కృష్ణ సినిమా ని ఎన్టీఆర్ చేయాలసింది కానీ ఆ సినిమా రవితేజ గారు చేసారు.వినాయక్ తో ఈ రెండు సినిమా లు ఎన్టీఆర్ చేసి ఉంటె ఎలా ఉండేదో.. ఇక సురేందర్ రెడ్డి గారి ‘అతనొక్కడే’,’కిక్’ సినిమా ల ను మొదట జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించారు ఆయన రిజెక్ట్ చేయడం తో కళ్యాణ్ రామ్,రవి తేజ లు చేసారు వారి కెరీర్ లో ఈ సినిమా లు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

సుకుమార్ మొదటి సినిమా అయినా ‘ఆర్య’ సినిమా ని జూనియర్ ఎన్టీఆర్ తో తీయాలి అనుకున్నారు కానీ ఆ లవ్ స్టోరీ తనకు సెట్ కాదు అని రిజెక్ట్ చేసారు..ఆర్య సినిమా తో అల్లు అర్జున్ గారికి వచ్చిన స్టార్డం అంత ఇంత కాదు లవ్ స్టోరీ ల లో ట్రెండ్ సెట్ చేసింది అప్పట్లో ఆర్య.బోయపాటి శీను మొదటి సినిమా ‘భద్ర’ మూవీ ని కూడా మొదట జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్నారు కానీ రవితేజ తో చేసారు రవితేజ కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా..ఎన్టీఆర్ వదులుకున్న ఈ సినిమా లు ఇతర హీరో ల కి వాళ్ళ కెరీర్ ల కి ఎంతగొనే ప్లస్ అయ్యాయి మరి ముఖ్యంగా రవితేజ ,అల్లు అర్జున్ గారికి జూనియర్ ఎన్టీఆర్ వదుకున్న సినిమా లు విజయాల్ని తెచ్చి పెట్టాయి.

687 views