NTR:100 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే అంత సీన్ జూనియర్ ఎన్టీఆర్ కి ఉందా ?

Posted by venditeravaartha, April 12, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు హైయెస్ట్ రెమ్యూనిరేషన్ తీసుకునే వారి లో మొదటి తరం హీరో లు అయినా ఎన్టీఆర్ ,నాగేశ్వర రావు,రాజ్ కుమార్,రాజేష్ ఖన్నా,దిలీప్ కుమార్ ,. M.G. రామచంద్రన్,శివాజీ గణేశన్ లాంటి స్టార్ హీరో లు అందరు తమ రెమ్యూనిరేషన్ ని నెల జీతం కింద తీసుకునే వారు,తరవాత కాలం లో సినిమా, సినిమా కి అది పెంచుకుంటూ వెళ్లారు ,వారి తర్వాతి తరం హీరో లు అయినా అమితాబ్ బచ్చన్ ,రజినీకాంత్ ,కమల్ హాసన్,చిరంజీవి,సల్మాన్ ఖాన్ ,షారుఖ్ ఖాన్ లాంటి బడా స్టార్ హీరో లు రెమ్యూనిరేషన్ ని కోట్ల ల లో తీసుకున్నారు ,వారి కి ఉన్న ఫాన్స్ ,సినిమా విజయాల మీద వారి రెమ్యూనిరేషన్ ఉండేది ,కానీ ఇప్పుడు ఒక్క సినిమా తో వారి రెమ్యూనిరేషన్ ఆకాశం అంత ఎత్తుకు తీసుకుని పోతున్నారు.

ప్రస్తుత స్టార్ హీరో లు గా చెప్పుకుంటున్న కొంత మంది హీరో లు తమ రెమ్యూనిరేషన్ 100 కోట్ల కి పైన తీసుకుంటున్నట్లు సమాచారం ,ఆ జాబితా లోకి ఈ మధ్య కాలం లో మన తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా ఉన్నారు ,ప్రభాస్ అందరికంటే ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకుతున్నట్లు సమాచారం ,అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లోకి RRR హీరో కూడా చేరారు.

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ‘వార్2’ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్పైయూనివర్స్ లో నటించేందుకు తారక్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఆసక్తికరంగా మారింది.’ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ దక్కించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). వరల్డ్ వైడ్ గా తారక్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈక్రమంలో ఆయన లైనప్ లోకి భారీ చిత్రాలు వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ స్పైయూనివర్స్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.


యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న స్పై యూనివర్స్ లో ‘వార్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. హృతిక్ రోషన్ – ట్రైగర్ ష్రాఫ్ కలిసి మొదటి భాగంలో నటించగా.. War2లో మాత్రం హృతిక్ రోషన్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నారు. చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ 100 కోట్ల మేర రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం ఉంది ,కానీ 300 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ‘వార్ 2 ‘ లో ఎన్టీఆర్ కి 100 కోట్లు ఇస్తే ఇక ప్రధాన హీరో గా ఉన్న హ్రితిక్ రోషన్ కి ఎంత ఇవ్వాలి ,సినిమా నిర్మాణకి ఎంత ఖర్చు చేయాలి.కాబట్టి సోషల్ మీడియా లో వస్తున్న కథనాలు నిజం కావు.మరి ఎన్టీఆర్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు అనేది త్వరలోనే బయట కి రాబోతుంది.

797 views