RRR మూవీ ఇచ్చిన హైప్ తో ఒక రేంజ్ లో స్టార్ క్యాస్ట్ ని సిద్ధం చేస్తున్న ఎన్టీఆర్ 30 మూవీ టీం !!!

Posted by venditeravaartha, March 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ప్రస్తుత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆల్ రౌండర్ గా పేరు ఉన్న నటుడు ‘జూనియర్ ఎన్టీఆర్ ‘, 2010 లో రిలీజ్ అయినా బృందావనం సినిమా తో మంచి విజయం అందుకున్న ఎన్టీఆర్ , ఆ తర్వాత వరుసగా 6 ప్లాప్ ల తో తన అభిమానులని నిరాశపరిచారు, కానీ 2015 లో రిలీజ్ అయినా టెంపర్ సినిమా తో సూపర్ హిట్ ని అందుకున్నారు, నాన్నకు ప్రేమతో ,జనతా గ్యారేజీ ,జై లవ కుశ ల తో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ 2018 లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ ‘ తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 4 ఇయర్స్ గ్యాప్ లో రిలీజ్ అయినా RRR తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ రావడమే కాకుండా , తాను రాంచరణ్ తో కలిసి స్టెప్స్ వేసిన ‘నాటు నాటు ‘ సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది . హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు , ఆస్కార్ అవార్డు , గ్లోబల్ స్థాయి లో పేరు ఇలా అన్ని విధాలుగా ఖుషి లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారు త్వరలోనే ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

NTR 30 movie team

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఈ సినిమా గ్రాండ్‌ లాంఛ్ మార్చి 23న జరగనున్నది. మూవీ రెగ్యులర్ షూట్ మార్చి 30 నుండి షురూ కానుందని టాక్. ఈ విషయంలో త్వరలో టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేయనుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదలకానుంది, యాక్షన్ సీన్స్‌తో షూటింగ్‌ను మొదలు పెట్టనున్నట్లుతెలుస్తోంది. మొదటి షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా ఉండనుందట. దీనికి సంబంధించి టీమ్ ఇప్పటికి చేయాల్సిన ఏర్పాట్లు కూడా చేసిందని టాక్.

NTR 30 movie team preparing a star cast in a range with the hype given by RRR movie !!!

అత్యంత వైభవంగా సెట్స్‌ను తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఓపెనింగ్ షెడ్యూల్‌ను ఇక్కడే చిత్రీకరించనున్నారట.. ఈ సెట్స్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఈ సెట్స్ డిజైన్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా కథతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అందుకు ముందు అనుకున్నకథను పక్కకు పెట్టి,పూర్తిగా కొత్త కథతో ముందుకుపోతున్నారట. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్‌కు కాస్తా ఆలస్యం అవుతోందని అంటున్నారు.

NTR 30 movie team preparing a star cast in a range with the hype given by RRR movie !!!

ఇక ఈ సినిమా లో భారి గానే స్టార్ క్యాస్ట్ ఉండబోతుంది , మొన్న ఈ మధ్యనే హీరోయిన్ గా జాన్హవి కపూర్ ని సినిమా యూనిట్ ఎన్టీఆర్ 30 లోకి వెల్కమ్ చెప్పారు, అలానే ఏ సినిమా లో విల్లన్ గ బాలీవుడ్ స్టార్ హీరో అయినా ‘సైఫ్ అలిఖాన్ ‘ ని ఎంచుకున్నట్లు సమాచారం, ఇప్పటికే ప్రభాస్ గారి పాన్ ఇండియా మూవీ అయినా ‘ఆదిపురుష్’ లో రావణాసుర క్యారక్టర్ చేస్తున్నారు సైఫ్అలీఖాన్. అలానే తమిళ్ , మలయాళం నుంచి కూడా కొంత మంది యాక్టర్స్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.

NTR 30 movie team preparing a star cast in a range with the hype given by RRR movie !!!

ఇక టెక్నికల్ విభాగానికి వస్తే ‘విక్రమ్’ సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా,రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు.

NTR 30 movie team preparing a star cast in a range with the hype given by RRR movie !!!

ఈ సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.,జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. RRR తర్వాత ఎన్టీఆర్‌కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్‌లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘జనతా గ్యారేజీ’ వచ్చి మంచి విజయం సాధించింది. దీంతో రెండో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

NTR 30 movie team preparing a star cast in a range with the hype given by RRR movie !!!

ఇక ఆ మధ్య ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ వీడియోలో డైలాగ్స్ అదిరిపోయాయి. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మంచి తను ఉండకూడదని,అప్పుడు భయానికి తెలియాలి తను రావల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా అంటూ సాగే వీడియో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

581 views