Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుండి ఎవరైనా ఇండస్ట్రీ కి వచ్చారంటే వారికి క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మెగా అనే బ్రాండ్ మీద ఆ కుటుంబం నుండి ఎవరు వచ్చినా వారి కెరీర్ సక్సెస్ అవుతూ ఉంటుంది. అలా వచ్చిన అమ్మాయి నిహారిక కొణిదెల. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమెకు మొదటి సినిమా నుండే కలిసి రాలేదు. చేసిన ప్రతీ చిత్రం అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత చైతన్య అనే వ్యక్తిని పెళ్ళాడి నటనకు దూరమై, కేవలం నిర్మాతగా మాత్రమే కొనసాగింది. నిర్మాతగా కూడా ఈమెకి విజయం వరించలేదు.
ఈ సంగతి కాసేపు పక్కన పెడితే ఆమె పెళ్లాడిన చైతన్య తో ఈమధ్య కాలంలోనే కొన్ని అనుకోని సంఘటనలు జరగడంతో విడాకులు తీసుకుంది. ఈమె విడాకులు తీసుకున్నప్పటి నుండి సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివిటీ ని మూటగట్టుకుంది. కానీ ఆమె అవేమి పట్టించుకోకుండా, తన పనులను తానూ చేసుకుంటూ పోయింది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి నటించడానికి ముందుకు వచ్చిన ఆమె, పలు వెబ్ సిరీస్ లలో నటించగా, వాటికి మిశ్రమ స్పందన లభించింది. త్వరలో థియేటర్స్ లో విడుదలయ్యే సినిమా పైన ఆమె భారీ ఆశలు పెంచుకుంది. కనీసం ఈ సినిమా అయినా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.ఇకపోతే సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉండే నిహారిక కొణిదెల, ఎప్పటికప్పుడు తన మనసులో ఉన్న మాటలను స్టోరిల రూపం లో ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఒక స్టోరీ తెగ వైరల్ గా మారింది.
ఇందులో ఆమె తనని ద్వేషించే వారికి, తనని ఇష్టపడేవారికి, తన శ్రేయోభిలాషులు, మిత్రులను ఉద్దేశిస్తూ ఒక ఆహ్వాన పత్రిక ని అప్లోడ్ చేసింది. ఇది కచ్చితంగా ఆమె మాజీ భర్త చైతన్య ని ఉద్దేశిస్తూ పెట్టిన స్టోరీ అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరో పక్క ఈ స్టోరీ పై నెగటివ్ కామెంట్స్ చేసేవారు కూడా ఎక్కువనే.ఇకపోతే మూడు పదుల వయస్సు దాటినా నిహారిక కి రెండవ పెళ్లి చేసుకునే ఆలోచన కూడా ఉందట. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల పైననే ఉందని, సినిమాల్లో సక్సెస్ ని చూసిన తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. సినిమాల్లో ఎలాగో సక్సెస్ ని చూడలేవు కాబట్టి, నీకు రెండవ పెళ్లి జరగదులే అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ వ్యంగ్యంగా నిహారిక పై కామెంట్స్ చేస్తున్నారు.