Janasena: పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజారిటీ తో గెలిపించాలి – నాని

Posted by venditeravaartha, May 7, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Natural star Nani: తెలుగు చలన చిత్ర పరిశ్రమని జగన్ అనే సైకో ఎంతలా టార్చర్ పెట్టాడో మన కళ్లారా చూసాము. సినిమా టికెట్ రేట్లను అతి తక్కువకి అమ్మాల్సిందిగా జీవో ని జారీ చేస్తూ సినీ మార్కెట్ ని ఎంత తగ్గించారో మన అందరికీ తెలిసిందే. కరోనా తో కుదేలు అయిపోయిన ఇండస్ట్రీ ఈ దరిద్రుడి కారణంగా మరింత కుదేలు అయిపోయింది. మన తెలుగు సినీ పరిశ్రమకి హాలీవుడ్ స్థాయిలో గుర్తింపుని దక్కించుకుంటూ ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంటున్న ఈ సమయం ఒక సైకో కారణంగా ఆంధ్ర ప్రదేశ్ మార్కెట్ పూర్తిగా కుదేలు అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ ని రక్షించండి అంటూ చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి, ప్రభాస్ స్థాయి వ్యక్తులు ఈ సైకో జగన్ దగ్గరకి వెళ్లి బ్రతిమిలాడుకుంటే ముష్టి వేసినట్టు ఒక జీవో ని జారీ చేసాడు జగన్.

ఆ జీవో కి పైగా టికెట్ రేట్స్ పెంచాలంటే మళ్ళీ ఈ సైకో అనుమతి కావాల్సిందే. అలాంటి సమయం లో టాలీవుడ్ తరుపున సీఎం జగన్ కి వ్యతిరేకంగత నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే, ఆయన తర్వాత తన గొంతు ని వినిపించిన వ్యక్తి న్యాచురల్ స్టార్ నాని. ఇప్పుడు ఆయన ధైర్యం గా ఈ ఎన్నికలకు పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ వెయ్యగా అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మా సినిమా ఇండస్ట్రీ కుటుంబం నుండి ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా లాగే ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా వస్తారని ఆశిస్తున్నాను అంటూ నాని వేసిన ట్వీట్ కి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒక సినీ హీరో అయ్యుండి ఒక రాజకీయ పార్టీ అధినేత గెలుపుని కోరుకునేందుకు ఎంతో ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం న్యాచురల్ స్టార్ నాని సొంతం, ఇక నుండి మా సపోర్టు అతనికే అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్వీట్స్ వేస్తున్నారు.

295 views