Mem famous: మేమ్ ఫేమస్ మూవీ రివ్యూ!

Posted by venditeravaartha, May 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ తమ కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రొడక్షన్ కంపెనీ ఛాయ్ బిస్కెట్ ,యూట్యూబ్ లో ఫేమస్ అయినా వారికీ అవకాశాలను కల్పిస్తూ వారిలో ఉన్నా టాలెంట్ ని బయటకు తీసుకుని వస్తున్నారు.రీసెంట్ సుహాస్ తో రైటర్ పద్మభూషణ సినిమా ఛాయ్ బిస్కెట్ వాళ్ళ కి సూపర్ హిట్ ని అందించింది.ఇప్పుడు యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ ,కవర్ సాంగ్స్ ల తో ఫేమస్ అయినా సుమంత్ ప్రభాస్(Sumanth prabhas) ని హీరో గా పరిచయం చేస్తూ మేమ్ ఫేమస్(Mem famous) అనే సినిమా ని తీసుకుని వచ్చారు.ఈ సినిమా కి కథ,స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ సుమంత్ ప్రభాస్.మరి యూత్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అయినా ఈ సినిమా ఎలా ఉంది,యూత్ ని ఆకట్టుకుందా లేదా అనేది చూద్దాం.

sumanth prabhas

కథ: మై, బాలి మరియు దుర్గ అనే ముగ్గురు చిన్ననాటి ప్రాణ స్నేహితులు,తెలంగాణ లోని
బండనర్సంపల్లి అనే గ్రామీణ ప్రాంతం లో ఎటువంటి లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. మై మౌనికతో ప్రేమలో ఉంటాడు అదే విధముగా బాలి బబ్బీతో ప్రేమలో ఉంటారు .కానీ వారి ప్రేమను వారి పెద్ద వాళ్ళు ఒప్పుకోరు.ఎలా అయినా వారి ప్రేమను గెలుచుకోవడానికి తమ జీవితాలని మెరుగుపరుచుకోవాలి అనుకుంటారు.అలా అవ్వాలి అంటే వారికీ సంపాదన కావాలి దానికంటే ముందు వారు బాగా ఫేమస్ అవ్వాలి అనుకుంటారు.దాని కోసం వారు ఏమి చేస్తారు? వారి ప్రేమను గెలుస్తారా? అనేది మిగిలిన కథ.

sumanth prabhas

విశ్లేషణ:టిక్ టాక్ ,రీల్స్ ,కవర్ సాంగ్ ల తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ ఈ సినిమా ద్వారా హీరో గా మరియు తానే డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.తాను రాసుకున్న కథ ని అద్భుతంగా తీసాడు అనే చెప్పాలి.ఈ సినిమా అంతటా పెల్లెటూరు లో జరిగే సంఘటనలు ల మీద అక్కడ వ్యవహారశైలి మీద చూపించారు. తెలంగాణ యాస ని అద్భుతంగా వాడుకుని సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి.మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ అద్భుతమైన సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ ఇచ్చారు.ఛాయ్ బిస్కెట్ ,లహరి మ్యూజిక్ వాళ్ళు కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా కి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అందించారు.
పాజిటివ్:సుమంత్ ప్రభాస్ నటన,కామెడీ ,డైలాగ్స్.
నెగటివ్:కథ,స్క్రీన్ ప్లే,సెకండ్ హాఫ్ ,ల్యాగ్ సీన్ లు.
రేటింగ్:3 / 5
చివరిగా మేమ్ ఫేమస్ అనేది యూత్ కోసం తీసిన ఒక ఎంటర్టైనర్.ఒక సారి చూడొచ్చు.

520 views