Rajamouli-Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా ని ఎందుకు రిజెక్ట్ చేసాడో నాకు ఇప్పటికి అర్ధం కాదు : రాజమౌళి

Posted by venditeravaartha, May 27, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి(Rajamouli).స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఇటీవల రిలీజ్ అయినా ఆర్ ఆర్ ఆర్ వరకు తన స్థాయి ని పెంచుకుంటూ తెలుగు సినిమా స్థాయి ని ప్రపంచ స్థాయి లో నిలబెట్టారు రాజమౌళి.ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరో లు ప్రభాస్ ,ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ,రవితేజ,నాని ల కు వారి కెరీర్ బెస్ట్ మూవీస్ ఇచ్చాడు. ప్రతి హీరో కి కూడా రాజమౌళి లాంటి డైరెక్టర్ తో పని చేయాలి అని ఉంటుంది.కానీ రాజమౌళి మాత్రం ఒక్క హీరో తో ఎప్పటి నుంచో వర్క్ చేయాలి అనుకుని ఆ ప్రాజెక్ట్ లేట్ అవుతుంది

rajamouli

రాఘవేంద్ర రావు గారి దగ్గర పని చేసిన అనుభం తో స్టూడెంట్ నెంబర్ తో డైరెక్టర్ గా మారిన రాజమౌళి మొదటి సినిమా తో సూపర్ హిట్ కొట్టారు ఆ తరువాత బాలయ్య బాబు తో సింహాద్రి (Simhadri)ప్లాన్ చేసిన అది వర్క్ అవుట్ కాకపోవడం తో జూనియర్ ఎన్టీఆర్ తో తీసి ఎన్టీఆర్ ని స్టార్ హీరో స్థాయి కి తీసుకుని వెళ్ళాడు.ఇక నితిన్ తో సై మూవీ అయ్యాక ప్రభాస్ ఛత్రపతి సినిమా తో టాలీవుడ్ కి తాను ఏంటో చూపించాడు.ఛత్రపతి మూవీ సూపర్ హిట్ అయ్యాక ఒక పోలీస్ బ్యాక్ డ్రాప్ మరియు కామెడీ ని మిక్స్ చేసి ఫుల్ కమర్షియల్ సినిమా తీయాలి అని అనుకుని తన ఫేవరెట్ హీరో అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసాడు.

pawan rajamouli

పవన్ కళ్యాణ్(Pawan kalyan) అప్పటికే బాలు,బంగారం,అన్నవరం సినిమా ల తో బిజీ గా ఉండటం తో పవన్ రాజమౌళి సినిమా ని రిజెక్ట్ చేసాడు.ఇక అదే సమయం లో వరుస హిట్ల తో ఉన్న రవితేజ తో ఆ సినిమా చేసారు రాజమౌళి,అదే 2006 లో రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ హిట్ విక్రమార్కుడు(Vikramarkudu).. అప్పటి వరకు రవితేజ కి ఉన్న ఇమేజ్ ని డబల్ చేసింది విక్రమార్కుడు.ఇప్పటికి కొన్ని సందర్భాల లో రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి విక్రమార్కుడు సినిమా పవన్ తో చేసి ఉంటె అప్పట్లోనే ఇండస్ట్రీ రికార్డు ల ను బద్దలు కొట్టేవాళ్ళం అని..ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో SSMB29 చేస్తున్న రాజమౌళి తన తదుపరి చిత్రాల లోఅయినా పవన్ కళ్యాణ్ గారితో కలిసి పని చేయాలి అని ఫ్యాన్స్ అందరు ఎదురుచూస్తున్నారు.

vikramarkudu

896 views