TS Inter Hall Tickets : టీఎస్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల

Posted by RR writings, February 25, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

TS Inter Hall Tickets : తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లను కాలేజీ లాగిన్‌ ఐడీలో పొందుపరిచగా.. తాజాగా ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. విద్యార్థులు www.tsbie.cgg.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించి తమ తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులు పదో తరగతి లేదా ఇంటర్‌ ఫస్టియర్‌ హాల్‌ టికెట్‌ నంబర్‌తో థియరీ పరీక్షల హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు ఫస్టియర్‌ లేదా రెండో ఏడాది హాల్‌ టికెట్‌ నంబర్‌తో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.

TS ఇంటర్ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
దశ 1 : TSBIE అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inని సందర్శించండి.
దశ 2 : హోమ్‌పేజీలో TS ఇంటర్ మొదటి సంవత్సరం లేదా ద్వితీయ సంవత్సరం హాల్ టిక్కెట్ లింక్‌పై క్లిక్ చేయండి.
దశ 3 : లాగిన్ పేజీలో TS ఇంటర్ మొదటి సంవత్సరం లేదా ద్వితీయ సంవత్సరం హాల్ టిక్కెట్ కోసం రోల్ నంబర్ లేదా మునుపటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
దశ 4 : హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలు
తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు జరుగుతాయి. ప్రథమ, ద్వితీయ పరీక్షలు ఒకే షిప్టులో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
28-02-2024 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
01-03-2024 – ఇంగ్లీష్ పేపర్-I
04-03-2024 – గణితం పేపర్-IA / బోటనీ పేపర్-I / పొలిటికల్ సైన్స్ పేపర్-I
06-03-2024 – మ్యాథమెటిక్స్ పేపర్-IB / జువాలజీ పేపర్-I / హిస్టరీ పేపర్-I
11-03-2024 – ఫిజిక్స్ పేపర్-I / ఎకనామిక్స్ పేపర్-I
13-03-2024 – కెమిస్ట్రీ పేపర్-I / కామర్స్ పేపర్-I
15-03-2024 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I / బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
18-03-2024 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-I / జియోగ్రఫీ పేపర్-I

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
29-02-2024 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
02-03-2024 – ఇంగ్లీష్ పేపర్-II
05-03-2024 – గణితం పేపర్-IIA / బోటనీ పేపర్-II / పొలిటికల్ సైన్స్ పేపర్-II
07-03-2024 – మ్యాథమెటిక్స్ పేపర్-IIB / జువాలజీ పేపర్-II / హిస్టరీ పేపర్-II
12-03-2024 – ఫిజిక్స్ పేపర్-II / ఎకనామిక్స్ పేపర్-II
14-03-2024 – కెమిస్ట్రీ పేపర్-II / కామర్స్ పేపర్-II
16-03-2024 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-II
19-03-2024 – మోడరన్ లాంగ్వేజ్ పేపర్-II / జియోగ్రఫీ పేపర్-II

273 views