Hritik roshan-Ntr: నువ్వా నేనా తేలిపోవాలి..తేల్చుకుందాం రా మిత్రమా అంటూ ఎన్టీఆర్ కి సవాలు విసిరినా హృతిక్ రోషన్

Posted by venditeravaartha, May 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఆర్ ఆర్ ఆర్(RRR) సినిమా తో గ్లోబల్ స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) మే 20 న తన 40 వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.ఈ సందర్భముగా రిలీజ్ చేసిన తన 30 వ సినిమా ‘దేవర'(Devara) ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది.ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ స్థాయి ఒక్క సారిగా రెట్టింపు అయింది అనే చెప్పాలి దానికి కారణం ఎన్టీఆర్ కి హాలీవుడ్ నుంచి అవకాశాల తో పాటు మంచి ప్రసంశలు కూడా వచ్చాయి.దీనితో పాటు గా బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్(Hritik roshan) తో సూపర్ బ్లాక్ బస్టర్ అయినా వార్ 2 (War 2)మూవీ లో నటిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి..అయితే ఇవి కేవలం రూమర్స్ అని కొంత మంది అన్నారు.మరి అలాంటి రూమర్స్ ని పటాపంచలు చేస్తూ ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే న హ్రితిక్ రోషన్ చేసిన ట్విట్ వాటి అన్నిటికి సమాధానం ఇచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కి హ్రితిక్ రోషన్ విషెస్ తెలియాచేస్తూ చెప్పిన ట్విట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.మీకు సంతోషకరమైన ఈ రోజు న మరియు రానున్న సంవత్సరం మీరు అనుకున్నట్లు హ్యాపీ గా ఉండాలి అని కోరుకుంటున్నాను..అలానే మనం ఇద్దరం కలిసి యుద్దభూమి లో పోటీ పడే అంత వరకు మీరు ఆనందం గా మరియు శాంతి తో ఉండండి అని ట్విట్ చేసాడు..దీని అర్ధం వార్ 2 లో వీరి మధ్య ఉండబోతున్న పోరాట సన్నేశాలను ఉద్దేశించి హ్రితిక్ ట్విట్ చేసాడు.ఇక 2019 లో రిలీజ్ అయినా వార్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అందులో హ్రితిక్ ,టైగర్ షరాఫ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకున్నాయి ఇప్ప్పుడు వార్ 2 లో హ్రితిక్ ,ఎన్టీఆర్ ల మధ్య వాటికి మించిన సీన్ లు ఉంటాయి అని అంటున్నారు.

543 views