HHVM :రాజమౌళి చేతుల్లోకి ‘హరి హర వీరమల్లు’ రెండవ భాగం..!

Posted by venditeravaartha, May 2, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Rajamouli : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కెరీర్ లో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ పీరియాడిక్ జానర్ లో నటించడం వల్ల ఈ చిత్రానికి ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. అయితే అనేక కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. 2021 వ సంవత్సరం లో ప్రభమైన ఈ సినిమా ఇప్పటి వరకు టాకీ పార్ట్ ని పూర్తి చేసుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలతో బిజీ అవ్వడమే కాకుండా, పాలిటిక్స్ లో కూడా బాగా బిజీ అవ్వడం తో సినిమా ఆలస్యం అయ్యింది. అయితే ఎన్నికలు పూర్తి అవ్వగానే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని నేడు మేకర్స్ విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ టీజర్ తోనే హరి హర వీరమల్లు చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న విషయం అందరికీ అర్థం అయ్యింది. మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ లోనే విడుదల అవ్వబోతుంది అట. ఇకపోతే ఈ సినిమా మొదటి భాగానికి డైరెక్టర్ క్రిష్ కాగా, రెండా భాగానికి డైరెక్టర్ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. నిర్మాత ఏఎం రత్నం డైరెక్టర్ రాజమౌళి ని రెండవ భాగం కోసం సంప్రదించినట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఈ సినిమాకి దర్శకత్వం వహించదు కానీ, సినిమాకి సంబంధించిన ఇన్ పుట్స్, గ్రాఫిక్స్ డిజైన్స్, స్క్రీన్ ప్లే తదితర అంశాలపై అవసరమైనప్పుడల్లా మార్పులు చేర్పులు చెప్తాడట. పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది మొత్తం ‘హరి హర వీరమల్లు’ రెండవ భాగం కోసం డేట్స్ ని కేటాయించడానికి సిద్ధంగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు అతి త్వరలోనే తెలియ చెయ్యనున్నారు మేకర్స్.

302 views