Nikhil: వరుస పాన్ ఇండియన్ మూవీస్ చేస్తున్న నిఖిల్ కి మిగిలిన యువ హీరోలకి ఉన్న తేడా ఏంటో తెలుసా ?

Posted by venditeravaartha, May 30, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరో ల లో నిఖిల్ సిద్దార్ధ్(Nikhil) కి సెపరేట్ స్టైల్ మరియు గుర్తింపు ఉంది అని చెప్పాలి దానికి కారణం తాను ఎంచుకునే కథలు అనే అంటారు అందరు.కానీ సంబరం మూవీ ద్వారా చిన్న క్యారెక్టర్ తో మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఆ తర్వాత హైదరాబాద్ నవాబ్స్ అనే చిత్రం ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసారు.కానీ 2007 లో శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్(Happy days) చిత్రం లో రాజేష్ క్యారెక్టర్ తో నిఖిల్ కి మంచి గుర్తింపు లభించింది.ఇక పరశురామ్ మొదటి సినిమా అయినా యువత తో కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించాడు.యువత మూవీ తర్వాత వరసగా 5 మూవీస్ ప్లాప్ అవడం తో నిఖిల్ పని అయిపోయింది అనుకున్నారు.

karthikeya2

నిఖిల్ తన స్నేహితుడు అయినా సుదీర్ వర్మ తో కలిసి 2013 లో చేసిన స్వామి రారా(Swamy rara)  సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ సాధించింది.ఇక ఆ తర్వాత నుంచి నిఖిల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు కార్తికేయ,ఎక్కడకి పోతావు చిన్నవాడా ,సూర్య vs సూర్య ,కేశవ ,కిరాక్ పార్టీ ,అర్జున్ సురవరం వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తో టాలీవుడ్ లో తనదైన మార్క్ ని ఏర్పరుచుకున్నారు.ఇక గత సంవత్సరం రిలీజ్ అయినా తన పాన్ ఇండియన్ మూవీ కార్తికేయ 2(Karthikeya 2) తో తన కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమా గా రికార్డు ని సాధించాడు.ఇక వెంటనే 18 పేజెస్ లాంటి లవ్ స్టోరీ తో మరో హిట్ ని అందుకున్న నిఖిల్ ఇప్పుడు ఇండియన్ మోస్ట్ కెప్టెడ్ సీక్రెట్ అంటూ సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ ని ఛేదిస్తూ స్పై గా రాబోతున్నాడు.

spy

స్పై(Spy) ఒక్కటే కాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త ప్రొడక్షన్ లో తానే మొదటి హీరో గా ఒక పాన్ ఇండియన్ మూవీ ని చేస్తున్నారు.ఇటీవలనే ఈ సినిమా కి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.ది ఇండియన్ హౌస్(The india house) గా రానున్న ఈ సినిమా 2024 లో రిలీజ్ కానుంది.అయితే టాలీవుడ్ ప్రస్తుతం ఉన్న యువ హీరో ల లో అఖిల్ ఒక్కడే తనకంటూ స్టైల్ ని ఎంచుకున్నాడు.రెగ్యులర్ కమర్షియల్ సినిమా లు కాకుండా కంటెంట్ మీద బేస్ అయినా సినిమా లు మాత్రమే చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ గా ఎదుగుతున్నాడు.కార్తికేయ 2 తో బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్న నిఖిల్ తన తదుపరి చిత్రాలు స్పై ,ది ఇండియా హౌస్ ల తో మరో స్థాయి కి వెళ్లనున్నారు.

india house

800 views