Venkatesh: ‘క్లిన్ కారా’కు వెంకటేష్ ఎన్ని లక్షల గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?

Posted by venditeravaartha, July 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ ది ప్రత్యేక స్టైల్. తండ్రి రామానాయుడు అండతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన సొంతంగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. సెంటిమెంట్, కామెడీ సినిమాలను వెంకటేష్ మాత్రమే మెప్పించగలడన్న పేరు పరిశ్రమలో ఉంది. తాజాగా ఈ హీరో గురించి సోషల్ మీడియాలో ఓ టాపిక్ హల్ చల్ చేస్తోంది. ఇటీవల నిర్వహించిన రామ్ చరణ్-ఉపాసన ల కూతురు బారసాల ఫంక్షన్లో వెంకీ మెరిశాడు. ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు. ఈ సందర్భంగా అదిరిపోయే గిప్ట్ లు తీసుకొచ్చారు. అయితే వెంకటేష్ తెచ్చిన బహుమతిపై ఆసక్తి చర్చ సాగుతోంది.

charan

రామ్ చరణ్-ఉపాసనలకు జూన్ 20న పండండి బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందని చిరంజీవి, సురేఖతో సహా కుటుంబ సభ్యులంతా వారం రోజుల పాటు పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ ద్వారా తమ ఇంట్లోకి మెగా ప్రిన్సెస్ వచ్చిందని తెలిపారు. తన మనువరాలుకు ‘క్లిన్ కారా’ అనే నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఈ పేరుకున్న అర్థాన్ని వివరిస్తూ మెగాస్టార్ ట్విట్టర్లో తెలిపారు.

klin kaara

ఇక క్లిన్ కారా బారసాలను జూలై 3న నిర్వహించారు. పెళ్లయిన 11 ఏల్ల తరువాత తమ ఇంట్లోకి వారసురాలు రావడంతో మెగా కుటుంబం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ హీరో విక్టరి వెంకటేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే వెంకటేష్ అదిరిపోయే గిప్ట్ ను తీసుకొచ్చి రామ్ చరణ్ దంపతులకు అందించారు. ఆ గిప్ట్ ఏంటంటే బంగారు మొలతాడు.

venkatesh

వెంకటేష్ తన మనువరాలి కోసం బంగారంతో ప్రత్యేకంగా మొలతాడును చేయించి బారసాల రోజు అందించారు. దీని విలువ కనీసం రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుందని నుకుంటున్నారు. ఎఫ్2, ఎఫ్3 సినిమాల తరువాత వెంకీ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఓ నవల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోబోతుంది. అయితే గతంలో ఆయన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్లాప్ కావడంతో మరోసారి వెంకీ వెబ్ సిరీస్ లజోలికి వెళ్లకూడదని నిర్ణియించుకున్నట్లు తెలుస్తోంది.

1997 views