Maruthi: డైరెక్టర్ మారుతీ కూతురు ఇలా తయారు అయ్యిందేంటి..? కుర్రాళ్ళు చూస్తే ఏమైపోతారో!

Posted by venditeravaartha, July 28, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Maruthi: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, చాలా చిన్న స్థాయి నుండి కెరీర్ ని ప్రారంభించి నేడు పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీసే రేంజ్ కి ఎదిగిన దర్శకుడు మారుతీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తియ్యడం లో ఈయన స్టైల్ వేరే. ఇది వరకు ఈయన మీడియం రేంజ్ హీరోలతో, సీనియర్ హీరోలతో సినిమాలు తీస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆయనకీ ఏకంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ తో సినిమా చేసే అవకాశం దక్కింది. అది కూడా ‘పక్కా కమర్షియల్’ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత.

ప్రభాస్ ఈ చిత్రాన్ని తన స్నేహితుల కోసం చేస్తున్నాడు. రేపు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉండగా మారుతీకి హియా అనే కూతురు ఉంది. ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాదు ఈమె ‘రాజా సాబ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుందట. ఇది ఇలా ఉండగా ప్రభాస్ తో తనకి ఉన్న అనుబంధం గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది హియా.

ఆమె మాట్లాడుతూ ‘ ప్రభాస్ అన్న ప్రతీ ఒక్కరితో చాలా సరదాగా ఉంటాడు. ఆయనలో తాను ఒక పెద్ద సూపర్ స్టార్ అనే అహం భావం ఇసుమంత కూడా ఇప్పటి వరకు చూడలేదు. సెట్స్ లో ఉన్న వారంతా సరదాగా, సంతోషంగా ఉన్నారంటే ప్రభాస్ అన్న ఉన్నాడని అర్థం. బాహుబలి సినిమా నుండి నేను ప్రభాస్ కి అభిమానిని. ప్రస్తుతం ఆయనతో నేను రాజాసాబ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాను. ఒకరోజు సెట్స్ లో నేను ఆన్లైన్ లో ఒక చాక్లెట్ ని చూసి అది కొనివ్వమని మా నాన్నని అడిగాను. ఇది విన్న ప్రభాస్ అన్న ఒక ప్లేట్ నిండా ఆ చాక్లెట్స్ ని నింపి నాకోసం పంపించాడు. ఆహరం విషయం లో ప్రభాస్ ఆ స్థాయిలో ఉంటాడు. అంతే కాదు ఒక మనిషికి ఏ అవసరం వచ్చినా ప్రభాస్ అన్న లాగ వేగంగా స్పందించే వారు ఇండస్ట్రీ లో ఉండరు’ అంటూ చెప్పుకొచ్చింది హియా.

ఇక పోతే ఈమె లుక్స్ ని చూసిన నెటిజెన్స్ అమ్మాయి చూసేందుకు చాలా చక్కగా ఉంది, కాస్త పెద్ద వయస్సు వచ్చిన తర్వాత సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

714 views