Dimple Hayati: న్యాయం కోసం హైకోర్టు ని ఆశ్రయించిన డింపుల్ హయతి.

Posted by venditeravaartha, June 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

గద్దల కొండ గణేష్ సినిమా లో ని జర్ర జర్ర పాట తో ఫేమస్ అయినా డింపుల్ హయతి, రవి తేజ సరసన ఖిలాడీ మూవీ తో మరియు గోపీచంద్ గారి రామబాణం సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన డింపుల్ ఈ మధ్య ఒక వివాదం లో చిక్కున్న సంగతి తెలిసిందే.తాను ఉంటున్నా అపార్ట్మెంట్ లో ట్రాఫిక్ డీసీపీ తో వివాదం లో ఇరుకున్న డింపుల్(Dimple hayati) ఇప్పుడు ఇదే విషయం లో హైకోర్టు ను ఆశ్రయించారు.

khiladi

గోపీచంద్ గారి రామబాణం(Ramabanam) సినిమాతో ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చిన డింపుల్ హయతి, ఐపీఎస్ అధికారి అయినా ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకు ఆమెకి మద్య వివాదం తలెత్తింది. పార్కింగ్ లో ఉన్న డీసీపీ కారును కాలితో తన్నడమే కాకుండా తన కార్ తో రివర్స్ లో వచ్చి ఢీకొట్టినందుకు డింపుల్ హయతి మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన మీద కావాలనే తప్పుడు కేసుల ను పెట్టారని ఆమె హైకోర్ట్ లో పిటిషను దాఖలు చేసారు.

dcp rahul
డీసీపీ రాహుల్(Rahul) కావాలనే తన మీద పెట్టిన కేసు కి ఆమెకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు..డింపుల్ తరుపున న్యాయవాది ,పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్న న్యాయస్థానం.. సీఆర్పీసీ 41 ఏ నిబంధనలు మేరకే పోలీస్ లు వ్యవహించాలి అని ఆదేశించింది.డైరెక్ట్ గా డీసీపీ తన మీద కేసు ఫైల్ చేయకుండా తన డ్రైవర్ చేతన్ కుమార్ చేత కేసు పెట్టించి డింపుల్ మరియు డేవిడ్ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

1368 views