సినీ ఇండస్ట్రీలో వారసులకు కొదువలేదు. ఇప్పుడున్న చాలా మంది వారసత్వం పుచ్చుకొని అడుగుపెట్టిన వారే. అయితే కొందరు బ్యాగ్రౌండ్ తో ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చినా రాణించలేకపోతున్నారు. మరికొందరు మాత్రం అడపాదడపా హిట్లుకొడుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు హీరోలు, డైరెక్టర్లు తమ కుమారులను పరిచయం చేశారు. హీరోయిన్లు, ఇతర నటీమణులు తమ కూతుళ్లను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ తన సోదరుడిని సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు తెగ ట్రై చేస్తోంది. ఆమె భామ ఎవరో కాదు. రాశి ఖన్నా. ఈమె తన సోదరుడితో ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆయనన చూసి త్వరలో హీరో అవుతాడని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
రాశిఖన్నా ఢిల్లీకి చెందిన అమ్మాయి. 1990 నవంబర్ 30న జన్మించారు. 2013లో ఈమె ‘మద్రాస్ కెఫె’ అనే హిందీ చిత్ర ద్వారా సినీ ఫీల్డులోకి వచ్చారు. ఆ తరువాత ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే రాశి ఖన్నా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. ఆ తరువాత కొద్ది కాలంలోనే పలు అవకాశాలు తెచ్చుకుంది. ఆమె నటించిన జిల్, బెంగాల్ టైగర్, హైపర్ సినిమాలు మంచి పేరును తీసుకొచ్చాయి. స్టార్ హీరో ఎన్టీఆర్ పక్కన జై లవకుశలో నటించినా ఆ సినిమా ఆకట్టుకోకపోవడంతో రాశిఖన్నా కు గుర్తింపు రాలేదు.
అయితే రాశిఖన్నా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. లేటేస్టుగా ‘రుద్ర’అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. తన సోదరుడితో కలిసి ఉల్లాసంగా ఉన్న రాశి ఖన్నా ను చూసి లైక్స్ కొడుతున్నారు. తనకు రౌనక్ ఖాన్ అనే సోదరుడు ఉన్నాడని పరిచయం చేస్తూ ట్విటర్లో ఓ మెసేజ్ రాసుకొచ్చారు. ‘మా సోదరుడు చిన్నప్పటి నుంచి ఫ్రాంక్ స్టార్. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు.’ అంటూ కామెంట్ చేసింది.
అంటే తన సోదరుడు త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని పరోక్షంగా చెప్పిందని తెలుస్తోది. అయితే ఈవీడియో వైరల్ కావడంతో చాలా మంది కామెంట్స్ పెట్టారు. సినీ ఇండస్ట్రీకి చెందిన అల్లు అర్జున్, వెన్నెల కిశోర్ లు స్పందించారు. ఇక ఆడియన్స్ స్పందిస్తూ త్వరలో రాక్ స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. మరి రాశి ఖన్నా తన సోదరుడిని ఏ సినిమాతో పరిచయం చేస్తుందో చూడాలి.