Guess the child:ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్

Posted by venditeravaartha, March 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఈ ఫోటో లో కనిపిస్తున్నా చిన్నారి ఎవరో కాదు ? 2017 లో రిలీజ్ అయినా ‘హలో’ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగు పెట్టిన ‘కళ్యాణి ప్రియదర్శన్ ‘, అక్కినేని అఖిల్ హీరో గా నటించారు. ఈమె తండ్రి గారు ప్రముఖ మలయాళం డైరెక్టర్ ‘ప్రియదర్శన్ ‘ ,
మలయాళం తో పాటు హిందీ ,తెలుగు,తమిళ్ లో కూడా సినిమా లు తీశారు.

నాన్న డైరెక్టర్ ,అమ్మ హీరోయిన్ కావడం తో చిన్నపాటి నుంచి సినిమా ల మీద ఆసక్తి ఉన్నపటికీ చదువు విషయం లో అశ్రద్ధ చూపలేదు , కళ్యాణి ప్రియదర్శన్ తన చెన్నై లో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి , ఆ తరువాత న్యూయార్క్ సిటీ నుంచి ‘పర్సోన్ స్కూల్అఫ్ డిజైన్ ‘ లో ఆర్కిటెక్చర్ డిజైనింగ్’ డిగ్రీ పొందారు , చదువు కుంటూనే తన లో ఉన్న సినిమా పిచ్చి తో అక్కడ కొన్ని థియేటర్ ల లో వర్క్ చేసే వారు, ఇండియా వచ్చిన తర్వాత పాండిచ్చేరి లో ఆదిశక్తి థియేటర్ లో తాను యాక్టింగ్ వర్కుషాప్ లో చేరారు.

మొదట గా ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ‘సాబు సైరిల్’ దగ్గర అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేసారు , ఆమె పని చేసిన సినిమా ల లో 2013 లో రిలీజ్ అయినా బాలీవుడ్ మూవీ ‘క్రిష్ 3 ‘, 2016 లో రిలీజ్ అయినా తమిళ్ మూవీ ‘ఇరు ముగం’ ఉన్నాయి.

ఆ తర్వాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో వచ్చిన అఖిల్ రెండవ సినిమా అయినా ‘హలో ‘ లో హీరోయిన్ గా చేసారు , ఆ సినిమా లో తాను చేసిన యాక్టింగ్ కి 2017 వ సంవత్సరానికి గాను ‘ఉత్తమ మొదటి హీరోయిన్ ‘ క్యాటగిరీ లో ‘ఫిలిం ఫేర్ అవార్డు ‘, ‘సైమా అవార్డు ‘ ల ను గెలుపొందారు. 2019 లో రిలీజ్ అయినా ‘సాయి ధరమ్ తేజ్ ‘ ‘చిత్ర లహరి’ సినిమా లో ‘లహరి ‘ పాత్రా లో చాలా చక్కగా నటించారు , వరుస అపజయాల తో ఉన్న ‘సాయి ధరమ్ తేజ్’ కి చిత్ర లహరి సూపర్ హిట్ ని ఇచ్చింది.

మలయాళం లో 2020 లో రిలీజ్ అయినా ‘వారనే ఆవశ్యమును’ సినిమా తో అడుగు పెట్టింది , ఈ సినిమా కి కూడా తాను ‘సైమా అవార్డు ‘ ను గెలుచుకున్నారు, 2017 నుంచి ఇప్పటి వరకు 11 సినిమా ల లో నటించారు , అందులో ఎక్కువ గా మలయాళం లో 5 సినిమా ల లో నటించారు. 2022 లో రిలీజ్ అయినా మలయాళం ‘హ్రిదయమ్’ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ఇలా తెలుగు సినిమా కి కొంచెం దూరం అయినా తమిళ్ ,మలయాళం సినిమా ల లో బిజీ గా ఉన్నారు కళ్యాణి ప్రియాదర్సన్.

559 views